నీలి చిత్రాల పరిశ్రమ నుంచి నేరుగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్ కి అక్కడ చాలా అవమానాలు, బాధలు ఎదురయ్యాయని వాపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోలు తనను చులకనగా చూసేవారని, దానికి చాలా బాధపడ్డానని సన్నీలియోన్ వెల్లడించింది. నిజానికి బాలీవుడ్ లో చాలామంది అగ్ర హీరోలు సన్నీలియోన్ కి అవకాశాలు కల్పించలేదు. అదే సమయంలో సింగిల్ ఆల్బమ్స్ తో పాపులారిటీ పెంచుకుంది. హిందీలో పలు హిట్ నంబర్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
తెలుగులో మంచు మనోజ్ నటించిన `కరెంటు తీగ` చిత్రంలో సన్నీలియోన్ నటించిన సంగతి తెలిసిందే. ఒక పాటలోను సన్నీ మెరుపులు మెరిపించింది. అయితే సన్నీలియోన్ తో ఒక వారియర్ కథతో పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసిన దక్షిణాది నిర్మాత ఆ తర్వాత ఐపు లేకుండా పోయాడు. ప్రస్తుతానికి సన్నీ తిరిగి సౌత్ లో రీఎంట్రీని ఘనంగా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఓ సినిమా చిత్రీకరణను ముగించి, తదుపరి నెట్ ఫ్లిక్స్ సినిమాలోను నటిస్తోంది. దక్షిణాదిన పలు సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసిందని కూడా చర్చ సాగుతోంది. సన్నీ తొందర్లోనే హాలీవుడ్ లోను అడుగుపెడుతోంది.
ఇక ఇదే సమయంలో సన్నీలియోన్ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా వెండి జిలుగుల డిజైనర్ గౌనులో సన్నీ తన అందచందాలను ప్రదర్శించింది. వెండి తళుకులతో డిజైన్ చేసిన ఆ బ్లౌజ్ కి తగ్గట్టే అందమైన పరికిణీ, కాంబినేషన్ లాంగ్ కోట్ ను కూడా ధరించింది. ఇక సన్నీలియోన్ మేకప్ సెన్స్ కూడా ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టే అందంగా కుదిరింది. మెడలో హారం, జడకు అల్లిన వెండి తాడు, చేతి వేలి ఉంగరాలు ఇలా ప్రతి యాక్సెసరీ ఎంతో అద్బుతంగా కుదిరాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నె ట్ లో వైరల్ గా మారుతోంది.