Advertisementt

న‌టి మ‌ర‌ణంలో మాజీ ప్రియుడి ప్రమేయం?

Sat 28th Jun 2025 01:55 PM
shefali  న‌టి మ‌ర‌ణంలో మాజీ ప్రియుడి ప్రమేయం?
Shefali last X post for her ex-boyfriend Sidharth goes viral న‌టి మ‌ర‌ణంలో మాజీ ప్రియుడి ప్రమేయం?
Advertisement
Ads by CJ

`కాంటాల‌గా గాళ్` షెఫాలి జ‌రివాలా ఆక‌స్మిక మ‌ర‌ణం చాలా సందేహాల్ని లేవ‌నెత్తింది. ముఖ్యంగా 42 వ‌య‌సుకే గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని క‌థ‌నాలు వెలువ‌డినా, దీనిని పోలీసులు అనుమానాస్ప‌ద కేసుగానే భావించి విచారిస్తున్నారు. ఇప్ప‌టికే ముంబై అంథేరిలోని షెఫాలి ఇంట్లో ఆధారాల్ని పోలీసులు సేక‌రించారు. ప్ర‌స్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ ప‌రీక్ష‌లు, పోస్ట్ మార్ట‌మ్ రిపోర్టుల కోసం ప్ర‌జ‌లు వేచి చూస్తున్నారు. ముంబై కూప‌ర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్ట‌మ్ ని నిర్వ‌హిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు.

ఈ స‌మ‌యంలో షెఫాలి గ‌త రిలేష‌న్ షిప్స్ గురించి ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే షెఫాలి ద‌రివాలా గ‌తంలో బుల్లితెర‌కు ప‌ని చేసిన స‌మ‌యంలో అక్క‌డ ప్ర‌ముఖ హోస్ట్, న‌టుడు సిద్ధార్థ్ శుక్లాతో డేటింగ్ చేసారు. అయితే ఇది దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి మాట‌. ప్రేమాయ‌ణానికి బ్రేక‌ప్ ప‌డిపోయాక‌, ఇద్ద‌రూ స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. క‌లిసి షూటింగులు చేస్తున్నారు. క‌లిసి న‌టిస్తున్నారు. ఇంత‌కుముందు స‌ల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ లోను ఒకే ఇంట్లో క‌లిసి క‌నిపించారు. వారి మ‌ధ్య ర్యాపో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అయితే స‌రిగ్గా ఇదే వ్య‌వ‌హారం షెఫాలి ప్ర‌స్తుత భ‌ర్త ప‌రాగ్ త్యాగీకి న‌చ్చ‌లేదంటూ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.  నిజానికి షెఫాలి - సిద్ధార్థ్ శుక్లా ఇప్ప‌టికీ రిలేష‌న్ లో ఉన్నారా? అంటే.. అలాంటిదేమీ లేదని ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో షెఫాలి ఖండించింది. త‌మ మ‌ధ్య ప‌రిణ‌తి చెందిన బంధం మాత్ర‌మే ఉంద‌ని, తాము స్నేహితులుగా కొన‌సాగుతున్నామ‌ని, త‌న భ‌ర్త కూడా దీనిని అర్థం చేసుకున్నార‌ని తెలిపింది. త‌న భ‌ర్త త్యాగి త‌న‌కు అండ‌గా ఉన్నార‌ని షెఫాలి ఈ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు. త‌మ మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు రాలేద‌ని భ‌ర్త‌ను ఆకాశానికెత్తేసారు. సిద్ధార్థ్‌తో నా బంధం ఇంట్లో ఏ సమయంలోనూ అసౌకర్యాన్ని కలిగించలేదని షెఫాలీ తెలిపారు.

అయితే సిద్ధార్థ్ శుక్లా 2021లో సడెన్ గా గుండెపోటుతో మ‌ర‌ణించాడు. అప్ప‌టికి అత‌డు వ‌య‌సు 40. ఆ స‌మ‌యంలో  ``ఈ రోజు నీవు.. ఆలోచిస్తున్నాను దోస్త్ @ సిద్ధార్థ్ శుక్లా`` అని షెఫాలి నివాళి అర్పించారు. ఇప్పుడు 42 వ‌య‌సులో షెఫాలీ గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని వార్త‌లు రావ‌డం బాధాక‌రం.

Shefali last X post for her ex-boyfriend Sidharth goes viral:

Shefali Jariwala last Twitter post for ex-boyfriend Sidharth Shukla goes viral 

Tags:   SHEFALI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ