ఫ్యామిలీ మ్యాన్ 3 నుంచి బిగ్ అప్ డేట్

Sat 28th Jun 2025 12:45 PM
family man 3  ఫ్యామిలీ మ్యాన్ 3 నుంచి బిగ్ అప్ డేట్
Family Man 3 coming soon ఫ్యామిలీ మ్యాన్ 3 నుంచి బిగ్ అప్ డేట్
Advertisement
Ads by CJ

అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్ అండ్ డీకే ద్వయం తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఈ సిరీస్ ఓటీటీ ప్రపంచంలోనే సంచలనం. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సక్సెస్ తర్వాత బోలేడన్ని వెబ్ సిరీస్ లు తెరకెక్కించారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 తర్వాత దానికి సీక్వెల్ గా ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించారు. ఫ్యామిలీ మ్యాన్ అంత కాకపోయినా.. సీజన్ 2 కూడా హిట్ అయ్యింది. 

దానికి కొనసాగింపుగా రాజ్ అండ్ డీకే ద్వయం ఫ్యామిలీ మ్యాన్ 3 ని తెరకెక్కించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్ కి సమయమైంది. అదే విషయాన్ని మేకర్స్ చిన్నపాటి వీడియో తో క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ లో కీలకమైన మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, ఇంకా ఇతర కీలక కేరెక్టర్స్ తో కూడిన వీడియో ని షేర్ చేస్తూ కమింగ్ సూన్ అంటూ ఇచ్చిన అప్ డేట్ వైరల్ అయ్యింది. 

మనోజ్ బాజ్‌పేయి రా ఏజెంట్ గా సీజన్ 1 అండ్ 2లో, సీజన్ 2 లో సమంత టెర్రరిస్ట్ గా, ప్రియమణి హౌస్ వైఫ్ గా కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ని ఓటీటీ ఆడియన్స్ బాగా ఆదరించడంతో దానిని సీరీస్ గా సీజన్స్ వైజ్ గా మేకర్స్ అందిస్తున్నారు. ఈ సిరీస్ 3 త్వరలోనే స్ట్రీమింగ్ వస్తుంది అంటూ ఇచ్చిన అప్ డేట్ మాత్రం ఓటీటీ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేసింది. 

Family Man 3 coming soon:

Family Man 3 web series coming soon

Tags:   FAMILY MAN 3
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ