Advertisementt

న‌యన్ ఆయిల్ కంపెనీ విలువ‌ 100కోట్లు

Wed 25th Jun 2025 04:37 PM
nayanthara  న‌యన్ ఆయిల్ కంపెనీ విలువ‌ 100కోట్లు
Nayanthara New Business With 100 Crs Investment న‌యన్ ఆయిల్ కంపెనీ విలువ‌ 100కోట్లు
Advertisement
Ads by CJ

చాలా మంది ఆర్టిస్టులు రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. కొంద‌రు వ‌స్త్ర శ్రేణి - ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల రంగంలో రాణిస్తున్నారు. మ‌రికొంద‌రు వైన్స్ డిస్టిల‌రీ రంగంలో, హోటల్స్ రెస్టారెంట్ల నిర్వ‌హ‌ణ‌లో అద్భుత ఆదాయాలు ఆర్జిస్తున్నారు. కానీ వీరంద‌రికీ భిన్నంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టిన మేటి క‌థానాయిక‌గా న‌య‌న‌తార పేరు మార్మోగుతోంది.

 

న‌య‌న‌తార ద‌శాబ్ధాల పాటు సౌతిండియా అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతున్నారు. ఒక్కో సినిమాకి 6-8 కోట్ల మ‌ధ్య పారితోషికం అందుకుంటున్న న‌య‌న్, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తోను భారీగా ఆర్జిస్తున్నారు. అయితే త‌న ఆదాయాన్ని ఎక్క‌డ పెట్టుబ‌డి పెడుతున్నారు? అంటే... న‌య‌న‌తార త‌న భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి ప‌లు లాభ‌దాయ‌క వ్యాపారాల్లో పెట్టుబ‌డి పెడుతున్న‌ట్టు తెలిసింది.

 

పాపుల‌ర్ లిప్ బామ్ కంపెనీని స్థాపించి ఇందులో వంద ర‌కాల వెరైటీ ఉత్ప‌త్తుల‌ను రూపొందించి మార్కెట్ కి అందిస్తోంది న‌య‌న్ సొంత ఫ్యాక్ట‌రీ. దీనికోసం ప్ర‌ముఖ ఛ‌ర్మ‌వ్యాధి నిపుణులు, సౌంద‌ర్య ఉత్ప‌త్తుల రంగంలో నిష్ణాతుడైన వైద్యుడు రెనిటా రాజ‌న్‌తో చేతులు క‌లిపారు. చెన్నైలోని ఒక పాపుల‌ర్ స్నాక్స్ అండ్ టీ చైన్ వ్యాపారంలోను న‌య‌న్ పెట్టుబడులు పెట్టారు. ఇది స‌క్సెస్ ఫుల్ బిజినెస్. అలాగే న‌య‌న‌తార రియ‌ల్ వెంచ‌ర్ల‌లోను విరివిగా డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టారు. త‌న పెళ్లికి ముందే తాను కొనుక్కున్న చాలా ఫ్లాట్లు, ప్లాట్ల ధ‌ర‌లు ఈ నాలుగేళ్ల‌లో అమాంతం పెరిగాయ‌ని తెలుస్తోంది.

 

రియ‌ల్ ఎస్టేట్ పోర్ట్ పోలియోతో పాటు, న‌య‌న‌తార యుఏఇలో ఓ ఆయిల్ కంపెనీలో భారీ పెట్టుబ‌డులు పెట్టార‌ని, ఇప్పుడు ఆ కంపెనీ ఎదిగి ఏకంగా 100 కోట్ల నిక‌ర ఆస్తుల‌ను క‌లిగి ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. న‌య‌న‌తార మొత్తం నిక‌ర ఆస్తి విలువ 200కోట్లు ఉంటే, చ‌మురు కంపెనీ నిక‌ర ఆస్తి విలువ 100వ కోట్లు ఉంద‌ని స‌మాచారం. 50కోట్ల ఖ‌రీదైన ప్ర‌యివేట్ జెట్ ని మెయింటెయిన్ చేస్తున్న‌ న‌య‌న‌తార ఇండియాలో రిచెస్ట్ లైఫ్ స్టైల్ ని ఆస్వాధిస్తున్న తార‌గా వెలిగిపోతోంది. అయితే న‌య‌న‌తార త‌న ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ గురించి ఎక్కువగా ప్ర‌చారం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. త‌న‌కు చెన్నైలో ఖ‌రీదైన బంగ్లా ఉంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, పెప్సీకో సీఈవో స‌హా ఇత‌ర ప్ర‌ముఖులు నివ‌శించే పోయెస్ గార్డెన్ చేరువ‌లోనే న‌య‌న్ సొంత విలాసాల ఇల్లు ఉంది.

Nayanthara New Business With 100 Crs Investment:

  Nayanthara New Business  

Tags:   NAYANTHARA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ