Advertisementt

రాజకీయాల్లోకి హీరోయిన్ మీనా

Wed 25th Jun 2025 02:19 PM
meena  రాజకీయాల్లోకి హీరోయిన్ మీనా
Heroine Meena enters politics రాజకీయాల్లోకి హీరోయిన్ మీనా
Advertisement
Ads by CJ

ఇప్పటికి హీరోయిన్ పాత్రలనే కోరుకుంటున్న మీనాకు దృశ్యం లాంటి చిత్రాల్లో కీలక పాత్రాలు దక్కుతున్నాయి. భర్త మరణం తర్వాత మీనా రెండో వివాహం చేసుకోబోతుంది అనే ప్రచారం జరగడం ఆమె దానిని ఖండించడం చూసాం. ఇప్పుడు మీనా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో కాదు కాదు కోలీవుడ్ మీడియా లో హైలెట్ అయ్యింది. 

తమిళ నాడు బీజేపీ నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్న హీరోయిన్ మీనా అనే వార్త ట్రెండ్ అవుతుంది, ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తుంది. మీనా రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే కొలిక్కి వచ్చిన చర్చలు, మీనా ఉపరాష్ట్రపతి జగ్దీప్ దన్కర్ ను మర్యాదపూర్వకంగా కలవడం చర్చనీయాంశమైంది. 

తమిళనాడు లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ, అందులో భాగంగా మీనా క్రేజ్ ని వాడుకోవాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను తమిళనాడులో బీజేపీ అధిష్టానం అడ్డదిడ్డంగా వాడేసుకుంటుంది. 

Heroine Meena enters politics:

Actress Meena to Join BJP?

Tags:   MEENA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ