కుబేర ను ఆదరించని తమిళ తంబీలు

Tue 24th Jun 2025 10:49 AM
kuberaa  కుబేర ను ఆదరించని తమిళ తంబీలు
Kuberaa Tamil performance కుబేర ను ఆదరించని తమిళ తంబీలు
Advertisement
Ads by CJ

గత శుక్రవారం భారీ అంచనాలు నడుమ బైలింగువల్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో విడుదలైన కుబేర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ నుంచి యునామాస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలోనూ కుబేర చిత్రంపై సినీవిమర్శకుల రివ్యూస్ అదిరిపోయాయి. కుబేర చిత్రంలో హీరో కోలీవుడ్ స్టార్ ధనుష్. కాకపోతే దర్శకుడు తెలుగు వాడైన శేఖర్ కమ్ముల. 

అయితే తెలుగు, తమిళ్ రెండింటిలోనూ హిట్ టాక్ తెచ్చుకున్న కుబేరకు తెలుగులో అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ కుబేర ను తమిళ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. దానితో కలెక్షన్స్ డల్ అయ్యాయి. ధనుష్ రియల్ అండ్ రస్టిక్ కేరెక్టర్ లో ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడు. దేవా కేరెక్టర్ లో ధనుష్ నటనకు వంక పెట్టడానికి లేదు, అంత అద్భుతంగా ఆయన కేరెక్టర్ ఆకట్టుకుంది. 

తెలుగు, తమిళ బైలింగువల్ చిత్రంగానే కుబేర ను శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. కాని తెలుగులో కుబేర కు వస్తున్న సూపర్ రెస్పాన్స్ మాత్రం తమిళ్ నుంచి రావడం లేదు. క్రిటిక్స్ బావుంది అన్నా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం లేదు. తమిళ ఆడియెన్స్ ఈ ఎమోషనల్ డ్రామాని అంతగా పట్టించుకోలేదనే వాదన సోషల్ మీడియాలోనూ వినిపిస్తుంది. 

హీరో తమవాడే, సినిమాకి హిట్ టాక్ పడింది, అయినా తమిళ ఆడియన్స్ ఎందుకు కుబేర ను లైట్ తీసుకున్నారనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Kuberaa Tamil performance:

Kuberaa Tamil collections details

Tags:   KUBERAA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ