Advertisementt



చరణ్ పెద్ది డిజిటల్ రైట్స్ కి రికార్డ్ డీల్

Tue 17th Jun 2025 06:14 PM
peddi  చరణ్ పెద్ది డిజిటల్ రైట్స్ కి రికార్డ్ డీల్
Peddi is making waves on OTT చరణ్ పెద్ది డిజిటల్ రైట్స్ కి రికార్డ్ డీల్
Advertisement
Ads by CJ

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పెద్ది చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వదిలిన పెద్ది గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ బ్యాట్ ఎత్తి కొట్టిన షాట్ చాలా రోజులు ట్రెండ్ అయ్యింది. దానితో పెద్ది చిత్రంపై పాన్ ఇండియా మర్కెట్ లో విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. 

తాజాగా పెద్ది డిజిటల్ రైట్స్ డీల్ పై దిమ్మతిరిగే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్ది చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కళ్ళు చెదిరే డీల్ తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.105 కోట్ల భారీ డీల్‌తో నెట్‌ఫ్లిక్స్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ కి కలిపి దక్కించుకుంది అని తెలుస్తుంది.. 

ఇంత భారీ ధరకి పెద్ది డిజిటల్ రైట్స్ సేల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెద్దిలో రగడ్ లుక్ లో రామ్ చరణ్ అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా శివ రాజ్ కుమార్, కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సంబందించిన ఓ క్రేజీ వర్కింగ్ పిక్చర్ ని బుచ్చిబాబు అభిమానులతో పంచుకున్నారు.

Peddi is making waves on OTT:

Whopping OTT deal for Peddi

Tags:   PEDDI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ