Advertisementt

సూపర్ స్టార్ కి విలన్ గా కింగ్ నాగార్జున

Tue 17th Jun 2025 06:12 PM
nagarjuna  సూపర్ స్టార్ కి విలన్ గా కింగ్ నాగార్జున
Nagarjuna confirms that he plays antagonist in Coolie సూపర్ స్టార్ కి విలన్ గా కింగ్ నాగార్జున
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున సోలో ప్రాజెక్ట్స్ కి కాస్త విరామం ఇచ్చారు. నా సామి రంగ తర్వాత నాగార్జున చెయ్యబోయే, ఆయన కెరీర్ లో మైలు రాయిలా నిలిచిపోయే 100 వ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలున్నా నాగార్జున ఎందుకో ఆ విషయం పక్కనబెట్టి ఆయన కూలి, కుబేర లాంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. కుబేర చిత్రం జూన్ 20 న విడుదలకు సిద్ధమైంది. 

ఆయన నటించిన మరో చిత్రం కూలి ఆగష్టు 14 న విడుదలకు సిద్దమవుతుంది. నాగార్జున సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి చిత్రంలో ఎలాంటి కేరెక్టర్ లో కనిపిస్తారు, గెస్ట్ రోల్ కాదు కదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. కుబేర చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కింగ్ నాగ్ తను కూలి చిత్రంలో ఎందుకు నటిస్తున్నాను, ఎలాంటి కేరెక్టర్ లో కనిపించబోతున్నారనే అనే విషయాన్ని ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. 

లోకేష్ కనగరాజ్-రజినికాంత్ కూలిలో విలన్ తానేనని, అలా ఎలా జరిగింది, తను ఆ విలన్ కేరెక్టర్ ని ఎందుకు ఒప్పుకున్నాననే విషయం కూడా బయటపెట్టారు. లోకేష్ నాగార్జునని కలిసి మీరు విలన్ గా చేయడానికి ఆసక్తిగా ఉన్నారా, ఒకవేళ లేకపోతే ఒక కప్పు టీ తాగేసి ఇద్దరం ఎవరి దారి వారు చూసుకుందామని అడిగితే.. దానికి నాగ్ నాకు హీరోగా చెయ్యాలి, విలన్ గా చెయ్యాలని రూల్ లేదు, ముందు స్క్రిప్ట్ నచ్చితే డిసైడ్ అవుతానని చెప్పగా, లోకేష్ చెప్పిన కూలి కథ విపరీతంగా నచ్చేసిందట. 

అలా అయిదారుసార్లు ఇద్దరు కూలి కథ గురించి డిస్కస్ చేసుకున్నాక క్యారెక్టర్ బాగా వచ్చాక తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాని నాగార్జున చెప్పారు, అలా కింగ్ నాగార్జున మొదటిసారి పూర్తిస్థాయి విలన్ గా కూలీలో కనిపించబోతున్నారన్నమాట. 

Nagarjuna confirms that he plays antagonist in Coolie:

Nagarjuna is confirmed to be playing the antagonist in Rajinikanth Coolie

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ