ఎన్టీఆర్-నీల్ మాసివ్ యాక్షన్ సీన్

Mon 16th Jun 2025 08:00 PM
ntr  ఎన్టీఆర్-నీల్ మాసివ్ యాక్షన్ సీన్
NTR-Neel movie update ఎన్టీఆర్-నీల్ మాసివ్ యాక్షన్ సీన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 పనులు ఆల్మోస్ట్ ముగించారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ వార్ 2 డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సెట్ లో బిజీగా వున్నారు. 2026 జనవరి 26 టార్గెట్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది అని తెలుస్తుంది. 

కొత్త యాక్షన్‌ సీన్‌ను భారీ సెట్‌లో రూపొందించేందుకు గాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేశాడని తెలుస్తోంది. నీల్ మూవీస్ అంటేనే భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీ లో మాత్రం యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కి సైతం పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఇక కొత్త షెడ్యూల్ లో చిత్రీకరించే భారీ యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారట. 

ఇప్పటి వరకు వేసిన సెట్స్‌తో పోల్చితే ఈ సెట్‌ అంతకు మించి అన్నట్లుగా భారీగా ఉంటుంది అని, సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్‌ సీన్‌ ఇది అని, ఈ యాక్షన్ సీక్వెన్స్ లో వందలాది మంది ఫైటర్స్‌ పాల్గొంటున్నారని, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు సైతం ఈ షూటింగ్‌లో కనిపించబోతున్నారని సమాచారం. 

ఈ మాసివ్ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని యూనిట్ వర్గాలు చెబుతున్నమాట. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది అని ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు.

NTR-Neel movie update:

NTR-Neel movie shooting update

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ