Advertisementt

రానా నాయుడు సీజన్ 2 కి పూర్ రివ్యూస్

Sun 15th Jun 2025 01:40 PM
rana naidu  రానా నాయుడు సీజన్ 2 కి పూర్ రివ్యూస్
Rana Naidu Season 2 public talk రానా నాయుడు సీజన్ 2 కి పూర్ రివ్యూస్
Advertisement
Ads by CJ

జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి వచ్చింది క్రేజీ వెబ్ సీరీస్ రానా నాయుడు 2. వెంకటేష్, రానా, సుర్విన్ చావ్లా, అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రల్లో కనిపించిన రానా నాయుడు సీరీస్ కి సీక్వెల్ గా రానా నాయుడు సీజన్ 2 వచ్చింది. ఈ సీరీస్ సీజన్ 1 లో బూతులు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ సీజన్ సౌత్ లాంగ్వేజెస్ లో క్లిక్ అవ్వలేదు. దానితో సీజన్ 2 విషయంలో మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుని డ్రామా, యాక్షన్ పై ఫోకస్ పెట్టారు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రానా నాయుడు సీజన్ 2 సీరీస్ ని పెద్దగా ప్రమోట్ చెయ్యకుండానే స్ట్రీమింగ్ లోకి తెచ్చేసారు. మరి ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన ఈ క్రేజీ సీరీస్ ని నెట్ ఫ్లిక్స్ వేదికగా వీక్షించిన వారు పెదవి విరుపులు, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్ చూస్తే రానా నాయుడు 2 మేకర్స్ కి దిమ్మ తిరగడం ఖాయం. 

దగ్గుబాటి రానా తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ అదిరిపోయినా, వెంకటేష్ గెస్ట్ క్యారెక్టర్ లా వచ్చిపోవడం పై ఆయన అభిమానులే డిజప్పాయింట్ అవుతున్నారు. ఆశించిన స్థాయిలో ఇంటెన్సిటీ పండలేదనేది మెయిన్ కంప్లైంట్. డ్రామా పండకపోవడం, స్లోగా సాగే ప్లాట్ తో ఓటీటీ ఆడియన్స్ కు రానా నాయుడు 2 విసుగొచ్చేలా చేసింది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. 

అలాగే వెంకటేష్ గురించి ఎంతో ఊహించుకుంటే ఏది లేదు అనే ఫీలింగ్ తెప్పించింది అంటున్నారు. అటు క్రిటిక్స్ కూడా పూర్ రివ్యూస్ ఇవ్వడం, ప్రేక్షకుల్లో రానా నాయుడు 2 ని వీక్షించాలనే కోరికను చంపేసింది. అసలు టీమ్ కూడా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఉండడం కూడా రానా నాయుడు పై ఎఫెక్ట్ పడింది అనే చెప్పాలి. 

Rana Naidu Season 2 public talk:

 Rana Naidu Season 2 social media talk

Tags:   RANA NAIDU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ