గతంలోలా సాఫ్ట్ గా కూల్ గా ఉంటాడు, మేమేమన్నా పడతాడు అనుకుని నోటికొచ్చినట్లుగా నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలకి చేస్తే.. మాములుగా ఉండదు, నారా లోకేష్ ని టచ్ చెయ్యాలనే ఆలోచన వస్తేనే చాలు ఆయన గడగడలాడిస్తున్నాడు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నప్పుడు ఎమన్నా అంటే పడ్డాడేమో, ఇప్పుడు రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని ఆరితేరిపోయాడు, అలాంటి వాడిని ఢీ కొంటే ఫలితం ఎలా ఉంటుందో రుచిచూపిస్తాను అంటూ లోకేష్ ఇస్తున్న మాస్ వార్నింగ్స్ కి ఆయన అభిమానులైతే ఫిదా అవుతున్నారు.
తాజాగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15,000 విద్యార్థులు, వారి తల్లితండ్రుల ఎకౌంట్స్ లోకి జమ చేస్తుంటే.. ఆ రూ.15000 లో రూ. రెండు వేలు లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలను నారా లోకేషు లైట్ గా తీసుకోలేదు, చాలా సీరియస్ గా తీసుకున్నారు.
తను ఫ్రాడ్ చేశాను అని నిరూపిస్తే, ఆధారాలు తీసుకొస్తే రాజీనామా చేస్తానని.. తనపై నోరు పారేసుకున్న జగన్ కు, పేర్ని నానికి, వైసీపీ నేతలకు లోకేష్ ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ పెట్టారు. కానీ 24 గంటల్లో వైసీపీ వాళ్ళు ఏమి నిరూపించలేక కామ్ గా ఉండిపోవడంతో నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వారికి వార్నింగ్ ఇచ్చారు.
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్
బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం @ysjagan గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? తేల్చుకోండి.. అంటూ డెడ్లి వార్నింగ్ ఇచ్చారు లోకేష్.