Advertisementt

సక్సెస్ అంటే ఫ్రీడమ్ - సమంత

Sat 14th Jun 2025 12:16 PM
samantha  సక్సెస్ అంటే ఫ్రీడమ్ - సమంత
Success means freedom - Samantha సక్సెస్ అంటే ఫ్రీడమ్ - సమంత
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సమంత వెబ్ సీరీస్ లు తప్ప సినిమాలను ఒప్పుకోవడం లేదు. కేవలం హెల్త్ రీజన్స్ వలనే సినిమాకు దూరంగా ఉంటున్నట్టుగా చెప్పిన సమంత ఈమధ్యనే నిర్మాతగా మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. సమంత నిర్మించిన శుభం హిట్ అవడంతో ఆమె మరింత ఉత్సాహంగా కనిపిస్తుంది. 

రీసెంట్ గా అబుదాబిలో ఛిల్ అయ్యి వచ్చిన సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది. దర్శకుడు రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది అనే ప్రచారం జోరుగా జరుగుతున్నా ఆమె మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా ఇతర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా సక్సెస్ అయితే ఫ్రీడమ్ వచ్చినట్టే అంటూ ఫిలాసఫీ మాట్లాడుతుంది. 

సక్సెస్ కి అసలైన నిర్వచనం ఫ్రీడమ్. అదే చెబుతాను. ఫ్రీడమ్ అంటే బందీగా ఉండకపోవడం, మెచ్యూరిటీ, లైఫ్ లో ఎదగడం అదే సక్సెస్ అదే స్వేచ్ఛ. గత రెండేళ్లుగా నా సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఆ టైమ్ లో నేను స్వేచ్ఛగా ఉన్నాను, నా చుట్టూ ఉన్నవాళ్ళ గతంతో పోలిస్తే నేను ఇప్పుడు సక్సెస్ అవ్వాలనుకోవడం లేదు. 

కానీ నేను గతంలో కంటే ఎక్కువ స్వేచ్ఛగా, సక్సెస్ ఫుల్ గా ఉన్నాను, కారణం నేను చేస్తున్న పనులు నాకు ఉత్సాహాన్నిస్తున్నాయి. వాటిని పూర్తి చెయ్యడం కోసం నేను ప్రతి రోజు ఎంతో ఉత్సాహంగా నిద్ర లేస్తున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. 

Success means freedom - Samantha:

Samantha Ruth Prabhu opens up on two-year break from films

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ