Advertisementt

నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం

Wed 11th Jun 2025 10:41 PM
nikhil  నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం
Major accident during Nikhil movie shooting నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం
Advertisement
Ads by CJ

హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ సెట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ది ఇండియన్ హౌస్ షూటింగ్ లో భాగంగ సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద పారింది. ఆ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సెట్ లో మరికొంత మంది గాయాల పాలైనట్లుగా సమాచారం.

ఈ ఘటన శంషాబాద్ సమీపంలో వేసిన సెట్ లో జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో సెట్ మొత్తం పాడైపోయి తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా సమాచారం అందుతుంది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Major accident during Nikhil movie shooting:

Major accident during The India House movie set

Tags:   NIKHIL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ