Advertisementt

మంగ్లీ పార్టీ కేసు-స్పందించిన దివి, శ్యామ్ కాసర్ల

Wed 11th Jun 2025 04:33 PM
divi  మంగ్లీ పార్టీ కేసు-స్పందించిన దివి, శ్యామ్ కాసర్ల
Singer Mangli Lands In Trouble మంగ్లీ పార్టీ కేసు-స్పందించిన దివి, శ్యామ్ కాసర్ల
Advertisement
Ads by CJ

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ రచ్చ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. గత రాత్రి అంటే జూన్ 10 మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకల్లో భాగంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్స్ లో డీజేలు, డాన్స్ లు పాటలతో హోరెత్తించగా.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు విదేశీ మద్యం, గంజాయి లాంటివి పట్టుబడ్డాయి. 

స్నేహతులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మంచి డిన్నర్ ఇచ్చిన మంగ్లీ తన బర్త్ డే లో విదేశీ మద్యం, గంజాయి కూడా పంపిణి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పార్టీలో నటి దివి, కాసర్ల శ్యామ్ ఉన్నట్లుగా మీడియాలో వార్తలు రావడంతో దివి రచయిత కాసర్ల శ్యామ్ మంగ్లీ బర్త్ డే పార్టీ, అలాగే దానిపై నమోదైన కేసుపై రియాక్ట్ అయ్యారు. 

కాసర్ల శ్యామ్ మట్లాడుతూ.. 

మంగ్లీ బర్త్ డే పార్టీకి నేను హాజరయ్యాను, బర్త్ డే పార్టీలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేవరకు నేను ఉన్నాను, పార్టీకి హాజరైన నేను, సెలబ్రేషన్స్ తర్వాత వచ్చేశాను, డ్రగ్స్ విషయం గురించి నాకు తెలియదు.. అలాంటి వాటికి నేను దూరం, నాకు డ్రగ్స్ అలవాటు లేదు, అనవసరంగా నాపేరుపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని కోరారు. 

ఇక దివి ఓ ఆడియో ని రిలీజ్ చేసింది. సింగర్ మంగ్లీ మంచి ఫ్రెండ్, ఆమె మంచి అమ్మాయి, అందుకే బర్త్ డే కి పిలిస్తే వెళ్ళాను, నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, నాపేరు, నా ఫోటో వేసి నన్ను బ్యాడ్ చెయ్యకండి. మీరు కూడా మీ ఫ్రెండ్ బర్త్ డే కి పిలిస్తే వెళతారు కదా, నేను అలాగే వెళ్ళాను, అందులో తప్పేముంది, అక్కడ జరిగిన దానికి నాకు సంబంధం లేదు అంటూ దివి మంగ్లీ బర్త్ డే పార్టీ అలాగే ఆ కేసు పై రియాక్ట్ అయ్యింది.  

Singer Mangli Lands In Trouble:

Divi and Kasarla Shyam reacts Mangli party

Tags:   DIVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ