Advertisementt

గాయ‌కుల మ‌ధ్య బిగ్ ఫైట్

Wed 11th Jun 2025 04:12 PM
badshah  గాయ‌కుల మ‌ధ్య బిగ్ ఫైట్
Big fight between singers గాయ‌కుల మ‌ధ్య బిగ్ ఫైట్
Advertisement
Ads by CJ

సెల‌బ్రిటీలు పదిమందికి ఆదర్శంగా ఉండాలి. ప్ర‌జ‌ల్లో గొప్ప పాపులారిటీ ఉన్న గాయ‌కులు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే పాట‌ల్ని అందించాలి. అన్ స్టాపబుల్ గా రంజింప‌జేయాలి. పోటీ ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. క‌ళారంగంలో ప్ర‌తిదీ స‌వాల్ గా తీసుకుని ఘ‌ర్ష‌ణ‌కు తావివ్వ‌కుండా అహింసాయుతంగా పోటీ ప‌డాలి.  అంతేకానీ.. ఒక‌రినొక‌రు కించ‌ప‌రుచుకుంటూ, నువ్వు నా కంటే దేనిలో ఎక్కువ‌? అని నిల‌దీసే త‌త్వం స‌రికాదు. ప్ర‌పంచం మొత్తం సెల‌బ్రిటీల‌ను ఆద‌ర్శంగా చూస్తుంది. కానీ అలాంటి పాపుల‌ర్ సెల‌బ్రిటీలు అయిన‌దానికి కానిదానికి ఘ‌ర్ష‌ణ పడుతూ ర‌చ్చ‌కెక్కితే దానిని ఏమ‌నాలి?

అలాంటి ఘ‌ర్ష‌ణ పాపుల‌ర్ పంజాబీ ర్యాప‌ర్లు బాద్ షా, యోయో హ‌నీ సింగ్ న‌డుమ చాలా ఏళ్లుగా కొన‌సాగుతోంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు దెప్పి పొడుచుకుంటారు. త‌క్కువ చేస్తూ మాట్లాడుతారు. వెకిలిగా, వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటారు. ఇది ఇత‌రుల‌కు చాలా సిల్లీగాను అనిపిస్తుంది. అయినా వారు ఏళ్లుగా వైరాన్ని వీడ‌టం లేదు. ఇద్ద‌రిలో ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు పాపుల‌ర్ పాప్ గాయ‌ని దువా లిపాపై బాద్ షా చేసిన ఓ కామెంట్ కి స్పందిస్తూ యోయో హ‌నీ సింగ్ చేసిన కామెంట్ మంట‌లు పుట్టిస్తోంది.

దువా లిపాతో మీరు ట్రాక్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అని ఒక నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ, ఆమెతో పిల్ల‌ల్ని క‌న‌డం కంటే గొప్ప ఇంకేం ఉంటుంది? అని వ్యాఖ్యానించాడు. ఇది సోష‌ల్ మీడియాల్లో అగ్గి రాజేసింది. ఇంత‌లో యోయో హ‌నీసింగ్ కూడా సీన్ లోకి వ‌చ్చాడు. `జీనియ‌స్` అంటూ క్లాప్ ఈమోజీల‌ను అత‌డు షేర్ చేయ‌గానే బాద్ షా అభిమానులు భ‌గ్గుమ‌న్నారు. నెటిజ‌నులు రెండుగా చీలి ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, బాద్ షా త‌న వ్యాఖ్య‌ల‌కు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చాడు. మ‌నం ఆరాధించే గాయ‌ని లేదా మ‌హిళ‌తో పిల్ల‌ల్ని క‌న‌డం అంటే, వారికి దానిని మించిన గొప్ప కానుక ఏం ఉంటుంది? అని క‌వ‌ర్ చేయ‌బోయి మ‌ళ్లీ వివాదాన్ని కొన‌సాగించాడు. ప్ర‌స్తుతానికి బాద్ షా నోరు జార‌గానే యోయో అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కానీ అత‌డు కూడా దొరక్క‌పోతారా?

Big fight between singers:

Badshah vs Yo Yo Honey Singh

Tags:   BADSHAH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ