ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balakrishna shares stunning details of Akhanda Thaandavam

అఖండ 2 షూటింగ్ పై బాలయ్య కామెంట్స్

నందమూరి నటసింహ బాలకృష్ణ-పవర్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి కలయికలో నాలుగో మూవీగా రాబోతున్న అఖండ 2 తాండవం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రెండు మాస్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసాయి. బాలయ్య అఖండ 2 లుక్ చూసి శివ తాండవం ఆడే మాదిరి ఉన్నారంటూ అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ సైతం సర్ ప్రైజ్ అయ్యారు. 

అఘోర గా బాలయ్య మంచు కొండల నడుమ విలయతాండవం చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. రీసెంట్ గానే జార్జియా దేశంలో అఖండ 2 షూటింగ్ భారీ షెడ్యూల్ జరిగింది. తాజాగా బాలయ్య అఖండ 2 జార్జియా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అఖండ 2 చిత్ర షూటింగ్ జార్జియాలో జరిగినప్పుడు అక్కడ -4 డిగ్రీల చలి ఉంది, అందరూ వణికిపోతుంటే, తాను మాత్రం అలానే నిలుచున్నానని  తెలిపారు. 

ఒకసారి పాత్రలో నిమగ్నమైన తనకు ఏదీ కనిపించదు.. మిగతాదంతా శివయ్యే చూసుకుంటాడని బాలకృష్ణ కామెంట్ చేసారు. మరి అఖండ కు మించి అఖండ 2 తాండవం రాబోతుంది అని టీజర్ తోనే క్లారిటీ ఇస్తూ భీభత్సమైన హైప్ క్రియేట్ చేసారు మేకర్స్. 

Akhanda Thaandavam: Balakrishna chills, others shiver

Balakrishna shares stunning details of Akhanda Thaandavam
akhanda thaandavam