Advertisementt

అన్నా-వదినలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్న షర్మిల

Tue 10th Jun 2025 04:21 PM
sharmila  అన్నా-వదినలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్న షర్మిల
Sharmila fires on Jagan అన్నా-వదినలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్న షర్మిల
Advertisement
Ads by CJ

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వీలుదొరికినప్పుడు, సందు దొరికినప్పుడు అన్న జగన్ ను, వదిన భారతి ని తెగ ఆడుకుంటుంది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో షర్మిల vs జగన్ అన్న రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. షర్మిల తన ఆస్తులను వదిన భారతికి రాసిచ్చాడు జగన్ అంటూ యుద్ధం చెయ్యడమే కాదు, రాజకీయాల్లో జగన్ కి షర్మిల శత్రువులా తయారైంది. 

ఇప్పుడు కూడా అమరావతి మహిళలను కించపరిచే విధంగా సాక్షి ఛానల్ డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణం రాజు, కొమ్మినేని చేసిన వ్యాఖ్యల ఫలితం కొమ్మినేని ని అరెస్ట్ చేసి లోపలేశారు, కొమ్మినేని కి 14 రిమాండ్ విధించింది కోర్టు. కృష్ణం రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొమ్మినేని, కృష్ణం రాజు, సాక్షి ఛానల్ పై మహిళల నిరసనల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగిన మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడంపై షర్మిల ఫైర్ అయ్యారు.

మాట, మాటకి జగన్ నా అక్కా, చెల్లెళ్లు అంటూ అంటారు.. సొంత చెల్లికి మర్యాద ఇవ్వలేదు.. ఇక రాష్ట్రంలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారని, సజ్జల రామకృష్ణ కొడుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనను కూడా వదిలిపెట్టలేదని, సైతాన్ సైన్యంతో తనపై తప్పుడు ప్రచారం చేశారని షర్మిల ఫైర్ అవడమే కాదు.. జగన్, భారతి సారీ చెప్పాలంటూ అన్న, వదినలకు షర్మిల లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. 

Sharmila fires on Jagan:

YS Sharmila Fires On Jagan And Bharathi Over Sakshi

Tags:   SHARMILA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ