Advertisementt

అఖండ తాండవం కాదు శివతాండవం

Mon 09th Jun 2025 06:16 PM
akhanda2  అఖండ తాండవం కాదు శివతాండవం
Akhanda2 Thaandavam In Theaters Dussehra అఖండ తాండవం కాదు శివతాండవం
Advertisement
Ads by CJ

బాలయ్య-బోయపాటి కలయికలో హ్యాట్రిక్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖండ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అందరికి తెలుసు. మరోసారి అదే కాంబోలో.. అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తాండవం చిత్రం పై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. 

జూన్ 10 అంటే రేపు నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే. మరి బాలయ్య బర్త్ డే అంటే అభిమానులకు పండగే, ఆ పండగను పదిరెట్ల ఉత్సాహంతో చేసుకునేందుకు అఖండ2 మేకర్స్ ఒకరోజు ముందే నందమూరి అభిమానులకు ఘాటు సర్ ప్రైజ్ రెడీ చేసారు. జూన్ 9 సాయంత్రమే అభిమానుల కోసం అఖండ 2 నుంచి పవర్ ఫుల్ పోస్టర్, టీజర్ అందులోను రిలీజ్ తేదీతో సహా వదిలారు. 

సెప్టెంబర్ 25 దసరా స్పెషల్ గా అఖండ 2 ని విడుదల చేస్తున్నట్లుగా బాలయ్య అఖండ తాండవం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ తో సహా అధికారికంగా ప్రకటించారు. అఖండ ఫస్ట్ లుక్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చాలా కొత్తగా కాదు కాదు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపించారు. 

ఇక అఖండ తాండవం టీజర్ లోకి వెళితే.. బాలయ్య అఖండ 2 లుక్ చూస్తే అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్ కి సైతం గూస్ బంప్స్ రావాల్సిందే. త్రిసూలంతో బాలయ్య చేసిన యాక్షన్ మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్. నా శివుడి అనుమతి లేనిదే ఆ యుముడైనా కన్నెత్తి చూడరు, నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో బాలయ్య రుద్ర తాండవం ఆడేసారు.. 

అఖండ 2 పోస్టర్, అఖండ తాండవం టీజర్ రెండు నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అనేలా ఉన్నాయి. బాలయ్య బర్త్ డేని ఒక రోజు ముందే అఖండ 2 టీజర్ తో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటూ హడావిడి మొదలు పెట్టేసారు. 

Akhanda2 Thaandavam In Theaters Dussehra:

Akhanda2 THAANDAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER 

Tags:   AKHANDA2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ