Advertisementt

కాకాణి రిమాండ్ పొడిగింపు

Mon 09th Jun 2025 05:43 PM
kakani  కాకాణి రిమాండ్ పొడిగింపు
Kakani remand extended కాకాణి రిమాండ్ పొడిగింపు
Advertisement
Ads by CJ

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నాటకీయ పరిణామాల నడుమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్ కేసులో A-4 గా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తనపై కేసు నమోదు కాగానే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తూ.. పోలీసులకు దొరక్కుండా కొన్నాళ్ళు అజ్ఞాతంలో గడపగా.. బెంగుళూరులో తలదాచుకున్న ఆయన్ని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

కాకాణి అరెస్ట్ అవ్వగానే ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. నెల్లూరు జల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా రిమాండ్ గడువు ముగియడంతో కాకాణి ని కోర్టులో హాజరు పరచగా, మరోసారి కోర్టు కాకాణికి 14రోజుల పాటు రిమాండ్ ను పొడిగించింది. 

ఈ కేసులో బెయిల్ కోసం అప్లై చేసిన కాకాణి కేసుని కోర్టు ఈనెల 11 కి విచారణ వాయిదా వేసింది. 

Kakani remand extended:

Kakani Govardhan Reddy remand extended

Tags:   KAKANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ