గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాక బయట ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ డీసెంట్ గా వైట్ డ్రెస్ లో కనబడుతున్నారు. సినిమాల్లో ఎలా కనిపించినా రాజకీయాల్లో మాత్రం పవన్ డ్రెస్సింగ్ స్టయిల్ వేరుగా ఉంటుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. హరి హర వీరమల్లు, OG చిత్రాలు షూటింగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా బయట కనిపించారు. పెనమలూరు మండలం లో ఒక షాపు ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.. అక్కడ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా స్మార్ట్ లుక్ లో కనిపించారు.
అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూడడానికి ఆయన అభిమానులు ఎగబడ్డారు. తన కోసం వచ్చిన అభిమానులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేసిన వీడియోస్, ఫొటోస్ చూసిన వారు పవన్ కళ్యాణ్ కొత్త లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు.




మినీ రివ్యూ: టూరిస్ట్ ఫ్యామిలీ 

Loading..