కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ చౌదరీ ఇక లేరు అనే గాలి వార్త ఆయన అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది. కొద్దిరోజుల క్రితమే మాగంటి గోపినాధ్ కి హెల్త్ కండిషన్ బాగోని కారణంగా ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ఆతర్వాత ఆయన ఆరోగ్య విషయాలేవీ పెద్దగా వినిపించలేదు.
ఈరోజు గురువారం మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లుగా వైద్ఫ్యులు చెప్పారు, ఈలోపే బీఆర్ ఎస్ నేత హరీష్ రావు గోపినాధ్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించి కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పారు. అయితే హారిష్ రావు గోపినాధ్ కి వైద్యం అందిస్తున్నారని చెప్పారు, ఈలోపే ఎమ్మెల్యే గోపీనాథ్ చౌదరీ మరణించినట్లుగా వార్తలు రావడమోఅందవరో కంగారు పడ్డారు...
గోపినాధ్ కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు, ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది, ప్రస్తుతం గోపినాధ్ కి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు, ఆయనని పలువురు రాజకీయనేతలు పరామర్శిస్తున్నారు. ఏఐజీ వైద్యులు గోపీనాథ్ చౌదరీ మృతి చెందినట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా ఆయన మరణించినట్లుగా పలు ఛానల్స్ లో వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాకవుతున్నారు.
ప్రస్తుతం గోపినాధ్ చౌదరి AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకోవాలంటూ అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.