Advertisementt

నారా వార‌బ్బాయి పెళ్లి ప్ర‌పోజ‌ల్ ఎలా జ‌రిగిందంటే

Thu 05th Jun 2025 04:57 PM
nara rohit  నారా వార‌బ్బాయి పెళ్లి ప్ర‌పోజ‌ల్ ఎలా జ‌రిగిందంటే
Nara Rohith gets engaged to co-star Sireesha Lella నారా వార‌బ్బాయి పెళ్లి ప్ర‌పోజ‌ల్ ఎలా జ‌రిగిందంటే
Advertisement
Ads by CJ

నారా రోహిత్- న‌టి, రెంట చింత‌ల అమ్మాయి సిరిని  ప్రేమ‌వివాహం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ పెళ్లి జ‌రిగిపోవాలి. గ‌త ఏడాది అక్టోబ‌ర్ లోనే ఎంగేజ్ మెంట్ అయింది. డిసెంబ‌ర్ లో పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.  కానీ అనారోగ్యంతో రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు అకాల మ‌ర‌ణంతో పెళ్లి వాయిదా ప‌డింది. దీంతో ఆయ‌న సంవ‌త్స‌రికం పూర్త‌య్యేవ‌ర‌కూ వెయిట్ చేయాల్సి వ‌చ్చింది.

ఈ ఏడాది అక్టోబ‌ర్ లో వివాహానికి కుటుంబ స‌భ్యులు రెడీ అవుతున్నారు. మ‌రి వీళ్లిద్దరిలో పెళ్లి ప్ర‌పోజ‌ల్ ఎవ‌రు తీసుకొచ్చారు? అంటే ఆ ఛాన్స్ తీసుకుంది నారా రోహిత్ అని తేలింది. సిరి కార‌ణంగానే రోహిత్ లో సిగ్గు బిడియం తొల‌గిపోయింద‌న్న విష‌యం అర్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా రోహిత్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఎలా ఉండేవాడో బ‌య‌ట ప‌డింది.  `న‌టుడైన కొత్త‌లో రొమాంటిక్ సీన్లు చేయాలంటే చాలా ఇబ్బంది ప‌డ్డా.

కాల క్ర‌మంలో అల‌వాటు చేసుకున్నా. షూటింగ్స్ లో నాపై తీసే షాట్స్ త‌ప్ప ఇంకేవి ప‌ట్టించుకోవ‌డం మానేసాను. అలా నేనో ఇంట్రోవ‌ర్ట్  గా పేరొందాను. కానీ సిరిలో క‌లుపుగోలు త‌నం న‌న్ను ఆక‌ట్టుకుంది. త‌న స్వ‌భావం నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైంది. నా జీవిత భాగ‌స్వామి అయితే బాగుంటుంద‌నిపించింది. దీంతో నేను దైర్యం చేసి పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాను. జోకులు, న‌వ్వుల‌తోనే మొద‌లైన స్నేహం పెళ్లి వ‌ర‌కూ దారి తీసింది.

ఇదంతా త‌లుచుకుంటా నాకే ఆశ్చ‌ర్యంగా ఉంది. ఇదంతా నేనే చేసానా? అనిపిస్తుంది. ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ చాలా కోపంగా ఉండేవాడిని. ఆవేశ ప‌డేవాడిని. అలాంటి నేను నాలో ఎన్నో మార్పులు తీసు కొచ్చాను. ఆ క్ర‌మంలో చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. సిరి ప‌రిచ‌యం న‌న్ను మ‌రింత‌గా మార్చింది` అన్నాడు. ఇటీవ‌లే  రోహిత్  బైర‌వం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.      

Nara Rohith gets engaged to co-star Sireesha Lella:

How did Nara Rohit marriage proposal happen

Tags:   NARA ROHIT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ