Advertisementt

థగ్ లైఫ్ రో: కోలీవుడ్‌లో క‌న్న‌డిగులు బ్యాన్

Wed 04th Jun 2025 10:40 AM
thug life  థగ్ లైఫ్ రో: కోలీవుడ్‌లో క‌న్న‌డిగులు బ్యాన్
Kannadigas banned in Kollywood థగ్ లైఫ్ రో: కోలీవుడ్‌లో క‌న్న‌డిగులు బ్యాన్
Advertisement
Ads by CJ

`థ‌గ్ లైఫ్` వివాదం ఈగో గొడ‌వ‌గా మారింది. ఇరు రాష్ట్రాలు త‌గ్గేదేలే అంటూ భీష్మించుకున్నాయి. ఇది కేవ‌లం ఒక సినిమాకి సంబంధించిన గొడ‌వ కాదు. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌ రాష్ట్రాల ప్రెస్టేజ్ కి సంబంధించిన గొడ‌వ‌. అందుకే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఫిలించాంబ‌ర్లు, నిర్మాత‌లు క‌లిసి సంయుక్తంగా `థ‌గ్ లైఫ్` రిలీజ్ పై నిర్ణ‌యం తీసుకోవాల్సిన త‌రుణం వ‌చ్చింది.

ఇంత‌కుముందు క‌ర్నాట‌క హైకోర్టు క‌మ‌ల్ సినిమా `థ‌గ్ లైఫ్‌` ని రిలీజ్ కానివ్వ‌కుండా మోకాల‌డ్డిన సంగతి తెలిసిందే. క‌న్న‌డిగుల‌కు క‌మ‌ల్ హాస‌న్ సారీ చెప్ప‌క‌పోతే `థ‌గ్ లైఫ్` ని రిలీజ్ చేయ‌లేర‌ని కోర్టు స్వ‌యంగా వెల్ల‌డించ‌డంతో అది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారింది. కానీ క‌మ‌ల్ మెట్టు దిగేందుకు సిద్ధంగా లేరు. తాను మాట్లాడింది త‌ప్పు కాద‌ని, త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని అత‌డు వాదించాడు. ఏది ఏమైనా ఇంకా థ‌గ్ లైఫ్ క‌ర్నాట‌క రిలీజ్ కి కోర్టుల ప‌రిధిలో అడ్డంకి తొల‌గిపోలేదు. స‌రిక‌దా ఈ వివాదం ఇంకా ముదురుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC)తో మంత‌నాలు సాగించేందుకు టిఎఫ్‌సిసి అధిప‌తులు, త‌మిళ యాక్టివ్ నిర్మాత‌లు మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌ప‌డం చ‌ర్చ‌గా మారింది. క‌మ‌ల్ హాస‌న్ క‌న్న‌డ భాష‌ను ఏమ‌న్నారు? అంటే.. క‌న్న‌డం త‌మిళం నుంచి పుట్టింద‌ని అన్నారు. కానీ త‌ప్పుడు ఉద్ధేశంతో క‌న్న‌డ‌ను ఆ మాట అన‌లేద‌ని టిఎఫ్‌సిసి స‌మ‌ర్థిస్తూ ఒక లేఖ‌ను కేఎఫ్.సిసికి రాసింది. ఈ లేఖ‌లో క‌మ‌ల్ హాస‌న్ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు చేసిన స‌హ‌కారాన్ని కూడా గుర్తు చేసారు. అత‌డికి అక్క‌డ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై అపార‌మైన గౌర‌వం ఉంద‌ని పేర్కొంది. 

ఇరు ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య స‌త్సంబంధాల‌కు భంగం క‌ల‌గ‌నీయ‌కూడ‌దు. ఇరు ప‌రిశ్ర‌మ‌లు క‌లిసి ప‌ని చేస్తున్నాయి. ఇరు ప‌రిశ్ర‌మ‌ల న‌టీన‌టుల మ‌ధ్య స‌త్సంబంధాలున్నాయి. క‌న్న‌డ న‌టులు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో న‌టిస్తున్నారు... వారికి మా స‌హ‌కారం ఉంటుంద‌ని కూడా త‌మిళ యాక్టివ్ నిర్మాత‌లు, చాంబ‌ర్ సంయుక్త లేఖ‌లో పేర్కొన్నాయి. ఈనెల 10న క‌న్న‌డ ఫిలించాంబ‌ర్ తో క‌మ‌ల్ హాస‌న్ డైరెక్టుగా క‌లిసి మాట్లాడుతార‌ని కూడా ఈ లేఖ పేర్కొంది. ప్ర‌స్తుతానికి లేఖ‌లు మాత్ర‌మే మాట్లాడుతున్నాయి. థ‌గ్ లైఫ్ క‌ర్నాట‌క‌లో రిలీజ‌వుతుందా లేదా? అనేదానికి స‌మాధానం ఇంకా స్ప‌ష్ఠంగా లేదు. ఈ వివాదం శైలిని ప‌రిశీలిస్తుంటే థ‌గ్ లైఫ్ రిలీజ్ ని అడ్డుకుంటే, త‌దుప‌రి క‌న్న‌డ న‌టీన‌టులు, ఫిలింమేక‌ర్స్ ని త‌మిళ‌నాడుకు రానివ్వ‌కుండా బ్యాన్ విధిస్తార‌నే సంకేతాలు అందుతున్నాయి.

Kannadigas banned in Kollywood:

IStand With Kamal Haasan trends as fans back actor amid Kannada ban Thug Life

Tags:   THUG LIFE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ