Advertisementt

లైంగిక వేధింపులు.. సినిమాటోగ్రాఫ‌ర్ ఊస్టింగ్

Tue 03rd Jun 2025 05:44 PM
cinematographer  లైంగిక వేధింపులు.. సినిమాటోగ్రాఫ‌ర్ ఊస్టింగ్
Cinematographer లైంగిక వేధింపులు.. సినిమాటోగ్రాఫ‌ర్ ఊస్టింగ్
Advertisement
Ads by CJ

సినీప‌రిశ్ర‌మ‌లో వేధింపుల ప్ర‌హ‌స‌నం అంతం లేనిది. సెట్ల‌లో ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని అధిగ‌మించి, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యంగా ప్ర‌వ‌ర్తించిన ప‌లువురు మ‌గ‌ న‌టులపై మీటూ ఉద్య‌మం వేదిక‌గా ఫిర్యాదుల అంద‌గా, పోలీసులు ద‌ర్యాప్తు చేసి చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు కోర్టు కేసుల్లోను న‌లుగుతున్నారు. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ స‌హా బాలీవుడ్, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోను ఇలాంటివి నిరంత‌రం బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.

తాజాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లో ప‌ని చేస్తున్న యువ సినిమాటోగ్రాఫ‌ర్ తీవ్ర‌మైన లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్నాడు. అత‌డిపై ఆరోప‌ణ‌లు రాగానే స‌ద‌రు నిర్మాణ సంస్థ మ‌ర‌క అంట‌కుండా వివ‌ర‌ణ ఇచ్చింది. అత‌డు కేవ‌లం పార్ట్ టైమ్ ఉద్యోగి. చాలా కాలం క్రితం త‌న ప‌ని ముగించుకుని, మా కంపెనీ నుంచి వెళ్లిపోయాడ‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. యువ సినిమాటోగ్రాఫ‌ర్ ప‌ని చేసే కాలంలో అత‌డిపై మ‌హిళ‌ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అంద‌లేద‌ని వివ‌రణ ఇచ్చింది.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న స‌ద‌రు సినిమాటోగ్రాఫ‌ర్ ని రెండు భారీ ప్రాజెక్టుల నుంచి తొల‌గించార‌ని తెలిసింది. వీటిలో రాజ్ కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ సౌర‌వ్ గంగూలీ బ‌యోపిక్ కూడా ఉంది. అలాగే షెఫాలీ షా లాంటి ప్ర‌తిభావంతుడు తెర‌కెక్కించ‌నున్న త‌దుపరి ప్రాజెక్ట్ నుంచి కూడా వివాదాస్ప‌ద సినిమాటోగ్రాఫ‌ర్ ని తొల‌గించారని క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త క‌మిటీల విచార‌ణ సాగుతోంది. కానీ నేరాన్ని ఇంకా ధృవీక‌రించాల్సి ఉంది. అత‌డు ఎవ‌రు? అన్న‌ది అటుంచితే, సినీప‌రిశ్ర‌మ‌లో వేధింపుల ప్ర‌హ‌స‌నం యువ‌త‌రం జీవితాల‌ను నాశ‌నం చేస్తోంద‌న‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌.

Cinematographer:

Cinematographer

Tags:   CINEMATOGRAPHER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ