Advertisementt

పాన్ ఇండియాలో తెలుగు హీరోల హ‌వా

Mon 02nd Jun 2025 03:59 PM
pan india craze  పాన్ ఇండియాలో తెలుగు హీరోల హ‌వా
Tollywood Heros Pan India Domination పాన్ ఇండియాలో తెలుగు హీరోల హ‌వా
Advertisement
Ads by CJ

టాలీవుడ్ నుంచి అర‌డ‌జ‌ను మంది పాన్ ఇండియా స్టార్లు నేడు ఉన్నారు. ప్ర‌భాస్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, విజ‌య్ దేవ‌ర‌కొండ భార‌త‌దేశంలో పాన్ ఇండియా స్టార్ల జాబితాలో  చేరారు. వీరిలో విజ‌య్ దేవ‌ర‌కొండ మిన‌హా ఇత‌ర హీరోలంతా 1000 కోట్ల క్ల‌బ్ కి అధిప‌తులుగా రికార్డుల‌కెక్కారు. రాజ‌మౌళి సినిమాతో మ‌హేష్ ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ అవ్వాల‌ని క‌ల‌గంటున్నాడు. ద‌గ్గుబాటి రానా కెరీర్ ఆరంభం నుంచి పాన్ ఇండియా న‌టుడే. బాహుబ‌లి భ‌ళ్లాల దేవ‌గా అత‌డికి పాన్ ఇండియా గుర్తింపు ద‌క్కింది. `మేజ‌ర్`తో అడివి శేష్‌, `కార్తికేయ 2`తో నిఖిల్ కూడా పాన్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్నారు. హ‌నుమాన్ తో ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భావం చూపిన యువ‌హీరో తేజ స‌జ్జా కూడా పాన్ ఇండియా స్టార్ గా త‌న పేరు నిల‌బెట్టుకోవ‌డానికి మిరాయ్ తో ముందుకు వ‌స్తున్నాడు. నేచుర‌ల్ స్టార్ నాని కూడా వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకొస్తున్నాడు. నితిన్, శ‌ర్వానంద్ స‌హా ఇత‌ర యువహీరోల ప్ర‌తిభ‌ను చూసినా త‌క్కువ చేయ‌లేం. ఈ ట్రెండ్ చూస్తుంటే, ఉత్త‌రాది బెల్ట్ లో ఇప్పుడు హిందీ స్టార్ల కంటే మ‌న పాన్ ఇండియా స్టార్ల హవానే ఎక్కువ‌గా క‌నిపించేట్టు ఉంది.

 

అయితే అన్నిటికీ స‌క్సెస్ గీటు రాయి. ద‌క్షిణాది కంటెంట్ లో వైవిధ్యం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రొటీన్ మాస్  యాక్ష‌న్ చిత్రాల‌తో పాటు, జాన‌ప‌దుల క‌థ‌లు, హిస్టారిక‌ల్ క‌థ‌ల‌తో ప్ర‌యోగాత్మ‌క పంథాలో కూడా సౌత్ ప్ర‌యాణిస్తోంద‌ని ఉత్త‌రాది ఆడియెన్ భావిస్తున్నారు. యూట్యూబ్, టీవీ చానెళ్ల ద్వారా సౌత్ సినిమాల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు ఆస్వాధించ‌డంతో మ‌న స్టార్ల‌కు మంచి గుర్తింపు ల‌భించింది.

 

ఇక‌ బాలీవుడ్ లో రీమేక్ లు, ఫ్రాంఛైజీ సినిమాలు రొటీన్ గా క‌నిపిస్తున్నాయి. అక్క‌డ‌ కాపీ క్యాట్ క‌థ‌లు, స‌న్నివేశాల‌తో సినిమాలు తీస్తున్నంత కాలం ఇది సౌత్ కి బాగా క‌లిసొస్తుంది. ఇప్ప‌టికే సౌత్ హ‌వా సాగుతోంది... మునుముందు సౌత్ స్టార్ల సినిమాలు ఉత్త‌రాది నుంచి మ‌రింత‌గా భారీ వ‌సూళ్ల‌ను తేవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పైన చెప్పిన అర‌డ‌జ‌ను మంది స్టార్ల తో పాటు కొత్త‌గా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేస్ లోకి దూసుకొస్తున్న స్టార్లు కూడా ఆశావ‌హంగా కనిపిస్తున్నారు. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థాంశాల‌ను ఎంపిక చేసుకుని తెలివిగా మార్కెట్ ని కొల్ల‌గొట్టే వ్యూహంలో చాలా మంది తెలుగు హీరోలు ఉన్నారు. వీరంతా ఎవ‌రికి వారు సైలెంట్ గా త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. వీళ్ల‌ను క్రియేటివ్ గా నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు చూపించేందుకు యువ ఔత్సాహిక దర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలాంటి వారంతా మునుముందు తాము ఆశించిన‌ స‌క్సెస్ సాధించాకే పూర్తిగా వెలుగులోకి వ‌స్తారు.

Tollywood Heros Pan India Domination:

  Tollywood Heros Pan India craze  

Tags:   PAN INDIA CRAZE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ