Advertisementt

స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై క్రేజీ న్యూస్

Mon 02nd Jun 2025 03:52 PM
spirit  స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై క్రేజీ న్యూస్
Crazy Update on Spirit flashback episode స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ-దీపిక మధ్యలో జరిగిన ఇండైరెక్ట్ సోషల్ మీడియా వార్ ఎంతగా ఫేమస్ అయ్యిందో అందరూ చూసారు. దానితో ప్రభాస్ స్పిరిట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అసలు సెట్ కి వెళ్లకముందే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి సందీప్-దీపిక ఇష్యు ట్రెండ్ అయ్యేలా చేసింది.

ఎప్పుడెప్పుడు ప్రభాస్ స్పిరిట్ సెట్ లోకి ఎంటర్ అవుతారా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూడని రోజు లేదు. జూన్ నుండి సందీప్ వంగ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్ రావొచ్చని అన్నారు కానీ క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా హను రాఘవపూడి తో లవ్ స్టోరీ ఫౌజీ(వర్కింగ్ టైటిల్) కంప్లీట్ చేసే మూడ్ లో ఉన్నారు.

తాజాగా స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్ పై ఓ న్యూస్ క్రేజీ క్రేజీగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్న‌ట్టు సందీప్ రెడ్డి వంగా ఇప్ప‌టికే రివీల్ చేసారు, స్పిరిట్ సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో సహా ఎమోష‌న‌ల్ సీక్వెన్స్ కూడా హైలెట్ అవుతాయని తెలుస్తుంది.

దానికి త‌గ్గ‌ట్టే సెకండాఫ్ లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ పై ఓ అద్భుత‌మైన ఫ్లాష్ బ్యాక్ ను సందీప్ ప్లాన్ చేశాడ‌ని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది.. మరి ఇందులో నిజమెంతున్నా ప్రస్తుతం ఈ న్యూస్ అయితే ప్రభాస్ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది. వారు ఈ వార్తలను తెగ ట్రెండ్ చేస్తున్నారు. 

Crazy Update on Spirit flashback episode:

Crazy Update on Prabhas Spirit

Tags:   SPIRIT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ