Advertisement

పార్కింగ్ సినిమాని నిజం చేసారు

కోలీవుడ్ లో తెరకెక్కిన పార్కింగ్ చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో ఓ పెద్దాయన, అప్పుడే పెళ్ళయ్యి భార్య ప్రెగ్నెంట్ తో ఉన్న వ్యక్తి పార్కింగ్ విషయంలో గొడవ పడడమే కాదు, పార్కింగ్ కోసం తలలు పగలగొట్టుకుని, చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. పార్కింగ్ సినిమా కేవలం ఈగో కి మూలకారణం అనే సారాంశం తో తెరకెక్కింది. ఇప్పుడు అదే పార్కింగ్ సినిమాకి నిజం చేసి చూపించారు కొందరు. అపార్ట్మెంట్ లో పార్కింగ్ విషయం తలెత్తిన గొడవ ఒకరి ప్రాణం పోయేదాకా వెళ్ళింది అంటే అది ఎంత పెద్ద గొడవో ఊహించవచ్చు. 

వివరాల్లోకి వెళితే.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి మండ‌లం నారాయ‌ణ‌పురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి తన ఫ్యామిలీతో క‌లిసి కొన్నేళ్లుగా కొత్త‌పేటలోని వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లోని అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజి వ‌చ్చారు. ఆయన కారును అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేశాడు. ఆతర్వాత బయటనుంచి ఇంటికొచ్చిన గండ్ర నాగిరెడ్డి త‌న కారును కృష్ణ కారు వెనక నిలిపాడు. అత్తగారింటి నుంచి తిరిగి వెళ్లిపోయే క్రమంలో కృష్ణ జివ్వాజి కిందికి రాగా.. త‌న కారుపై గీత‌లు క‌నిపించాయి.

దానితో కృష్ణ గండ్ర నాగిరెడ్డి తో గొడవ పడగా.. ఆ గొడవలో కృష్ణ, నాగిరెడ్డిని తోసెయ్యగా.. నాగిరెడ్డి చెవిలోంచి ర‌క్తం, నోటిలోంచి నురుగ వ‌చ్చి ప‌డిపోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ నాగిరెడ్డి ప్రాణాలు పోయేలా చేసింది.  

Parking Dispute Turns Violent

Parking made the movie come true
parking