భ‌గ‌వంత్ కేస‌రి ని లిఫ్ట్ చేసారు

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు, ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న `జ‌న‌నాయ‌గ‌న్` వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ్రుతిహాస‌న్, ప్ర‌కాష్ రాజ్ స‌హా ప‌లువురు అగ్ర తార‌లు న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్ రాజీ అన్న‌దే లేకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇది విజ‌య్ న‌ట‌నా కెరీర్ లో చిట్ట‌చివ‌రి సినిమా కావ‌డంతో అత‌డు కూడా చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఒక రేంజులో సాగుతోంది. శాటిలైట్, ఓటీటీ డీల్స్ ఇప్ప‌టికే ముగిసాయి. శాటిలైట్ రైట్స్ కోసం స‌న్ టీవీ దాదాపు 55 కోట్ల డీల్ ముగించింద‌ని తాజాగా స‌మాచారం అందింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా 120 కోట్లు చెల్లించేందుకు అంగీక‌రించింది. ఓవ‌రాల్ గా ఈ రెండు డీల్స్ తోనే జ‌న‌నాయ‌గ‌న్ నిర్మాత‌లు 175 కోట్లు అందుకుంటున్నారు. నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ అదిరింది కాబ‌ట్టి, దానికి త‌గ్గ‌ట్టే థియేట్రిక‌ల్ వ్యాపారానికి డోఖా ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా ఓ తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ కి రీమేక్ అన్న ప్ర‌చారం సాగుతోఓంది. జ‌న నాయ‌గ‌న్ లో మంచి- చెడు టాపిక్ ని తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ `భ‌గ‌వంత్ కేస‌రి` నుంచి లిఫ్ట్ చేసార‌ని తెలుస్తోంది. నిజానికి `భ‌గవంత్ కేస‌రి` రీమేక్ రైట్స్ ని జ‌న‌నాయ‌గ‌న్ నిర్మాత‌లు కొనుగోలు చేసారు. అందువ‌ల్ల ఆ స్క్రిప్టులో కొన్ని స‌న్నివేశాల్ని తెలివిగా విజ‌య్ సినిమా కోసం ఉప‌యోగించుకుంటున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఓవ‌రాల్ గా ఒక తెలుగు సినిమా క్రియేటివిటీని, కోలీవుడ్ అగ్ర హీరో సినిమా కోసం ఉప‌యోగించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Telugu director creativity for Jana Nayagan

Bhagavanth Kesari was lifted
jana nayagan