Advertisementt

ఫిలింఛాంబ‌ర్ ప‌డ‌గొట్టి క‌డ‌తారా

Fri 30th May 2025 09:11 AM
film chamber  ఫిలింఛాంబ‌ర్ ప‌డ‌గొట్టి క‌డ‌తారా
Will the Film Chamber be dismantled? ఫిలింఛాంబ‌ర్ ప‌డ‌గొట్టి క‌డ‌తారా
Advertisement
Ads by CJ

వ‌రుస‌గా రెండు ద‌ఫాలుగా మూవీ ఆర్టిస్టుల సంఘం ప్రెసిడెంట్ అయ్యాడు మంచు విష్ణు. వివాదాల‌తో సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించే మా అసోసియేష‌న్ లో మ‌న‌సులు గెలుచుకుని, ఐదేళ్లు పాలించ‌డం అంటే ఆషామాషీ కాదు. అత‌డు `మా` స‌భ్యుల‌కు ఫించ‌న్లు,  హెల్త్ కార్డులు వ‌గైరా సేవ‌లు స‌వ్యంగా చేసాడు గ‌నుకే స‌భ్యులు వ‌రుస‌గా ప‌ట్టంగ‌ట్టారు.

అయితే మంచు విష్ణు ఎన్ని కోట్లు ఖర్చ‌యినా, త‌న సొంత డ‌బ్బుల‌తోనే మా అసోసియేన్ బిల్డింగ్ ని నిర్మించి గిఫ్ట్ గా ఇస్తాన‌ని మొద‌టి సారి ఎన్నిక‌ల్లో ఘ‌నంగా ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత ప్ర‌య‌త్నాలు కూడా చేసాడు. కానీ ఎందుక‌నో ఈ ఐదేళ్ల‌లో ఇది ఫ‌లించక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. సినీప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల్లో చాలా చిన్న విభాగాల‌కు కూడా సొంత ఆఫీసులు ఉన్నాయి. కొన్ని అద్దె గ‌దుల్లో న‌డుస్తున్నా కానీ, ధ‌నవంతులంతా కొలువుండే మా అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ లేక‌పోవ‌డం అవ‌మాన‌క‌రంగా ఉంద‌ని భావిస్తున్న‌వారు లేక‌పోలేదు. న‌డిగ‌ర సంఘం భ‌వంతిని నిర్మించి అక్క‌డ అధ్య‌క్షుడు విశాల్ స‌త్తా చాటాడు.

కానీ మా ఆర్టిస్టుల‌ అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి నిర్మిస్తాన‌ని, అధ్య‌క్షుడు మంచు విష్ణు ప‌దే ప‌దే ప్ర‌పోజ్ చేస్తున్నా కానీ ప్రాక్టికల్ గా ఏదీ ముందుకు వెళ్ల‌లేదు. అత‌డు ఊగిస‌లాడిన‌ట్టు ఎవ‌రూ ఊగిస‌లాడ‌టం లేదా? ప‌రిశ్ర‌మ మూల స్థంబాలు ఎవ‌రూ అత‌డి ప్ర‌పోజ‌ల్ కి ముందుకు రావ‌డం లేదా? అనే సందేహాలు కూడా ఈ సంద‌ర్భంగా క‌లుగుతున్నాయి. తాజాగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌తో యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో మంచు విష్ణు వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారుతున్నాయి.

మా అసోసియేష‌న్ భ‌వంతిని నిర్మించ‌లేక‌పోవ‌డంపై త‌మ్మారెడ్డి సూటిగానే మంచు విష్ణును నిల‌దీసారు. తాను హైద‌రాబాద్ ఔట‌ర్ లో ఓ చోట ఇప్ప‌టికే నిర్మించిన భవంతి రెడీగా ఉంది.. దానిని అసోసియేష‌న్ కి తీసుకుందామ‌ని ప్ర‌పోజ్ చేసిన‌ట్టు విష్ణు అన్నారు. దానికి ఎవ‌రూ ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు. దాంతో ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్ లో ఉన్న ఫిలింఛాంబ‌ర్ స్థ‌లంలోనే పాత‌ది ప‌డ‌గొట్టి కొత్త‌ది క‌డ‌దామ‌ని ప్ర‌పోజ్ చేసాన‌ని విష్ణు తెలిపారు. త‌న‌తో పాటు పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌రో భాగ‌స్వామి కూడా దొరికాడ‌ని అన్నారు. అయినా కానీ ఇది కూడా ముందుకు వెళ్ల‌లేదు. అన్న‌ట్టు ఫిలింఛాంబ‌ర్ ప‌డ‌గొట్టి మ‌ళ్లీ క‌డ‌తారా?  దానికి కార్పొరెట్ లుక్ తెస్తారా?  ఎవ‌రైనా స్పందిస్తేనే క‌దా ఏదో ఒక‌టి తేలేది. 

Will the Film Chamber be dismantled?:

Film Chamber

Tags:   FILM CHAMBER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ