మహానాడుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

కడప జిల్లాలో గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న పసుపు జాతర మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తో సహా మంత్రి లోకేష్, అలాగే మిగతా టీడీపీ మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజుతో ముగియబోతున్న మహానాడు సక్సెస్ అవడం పై కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారి, చంద్రబాబు స్నేహతుడు, డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా మహానాడు పై వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, శ్రీ @ncbn గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంది.
2024 ఎన్నికల్లో NDA కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత @JaiTDP ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తొలి మహానాడు సందర్బంగా 12వ సారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను సైబరాబాద్ గా మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షించారు. 1999లో ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు మరియు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపచేశారు.
ఆయన అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో, ఈ నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను
ఈ శుభసందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.. అంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
Pawan Kalyan tweet on TDP Mahanadu
Pawan Kalyan Comments on the TDP Mahanadu







































