గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల లిస్ట్

ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో ఏర్పాటైన సినీ అవార్డుల జూరి కమిటీ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీల్ రాజు ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు. 

ఆతర్వాత తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 లిస్ట్ ని అనౌన్స్ చేసారు. 

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024 ప్రకటన

ఉత్తమ మొదటి చిత్రం కల్కి

ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్

ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు

ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప-2)

ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్ (కల్కి)

ఉత్తమ నటి - నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు)

ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2)

ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ హాస్యనటులు - వెన్నెల కిషోర్‌, సత్య

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గణేష్‌ ఆచార్య (దేవర)

ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు

ఉత్తమ పుస్తకం - రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)

స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్)

స్పెషల్ జ్యూరీ - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

స్పెషల్ జ్యూరీ - ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)

జూన్‌ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం

2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను..

త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ ఈ సందర్భంగా తెలిపారు. 

Gaddar Awards 2024 - Telangana Government Honors Telugu Cinema

Gaddar Telangana Film Awards List
gaddar awards