Advertisementt



మహానాడులో బాబు పాటలకు కార్యకర్తల స్టెప్స్

Thu 29th May 2025 11:20 AM
mahanadu  మహానాడులో బాబు పాటలకు కార్యకర్తల స్టెప్స్
TDP Activists Super Steps For Mahanadu Song మహానాడులో బాబు పాటలకు కార్యకర్తల స్టెప్స్
Advertisement
Ads by CJ

కడప జిల్లాలో గత రెండు రోజులుగా జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం ఈరోజుతో ముగియనుంది. మహానాడు లో ఏపీలో గత ఏడాది కాలంగా జరిగిన అభివృద్ధి పైన, అలాగే ఆరు సూత్రాలతో ఏపీని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీడీపీ మంత్రులు ప్రణాళికలు రూపొందించడం, యువనాయకుడు లోకేష్ కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేతలు సూచించడం, టీడీపీ కార్యకర్తల హడావిడి అంతా మహానాడులో హైలెట్ అయ్యింది. 

అంతేకాకుండా మహానాడు వేదికపై చంద్రబాబు పై చేసిన రీమిక్స్ సాంగ్స్ కి కార్యకర్తలు ఊగిపోతూ డాన్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అట్టాంటింట్టాటోడు కాదు సూడు మామో.. నారా చంద్రబాబు నాయుడు మామో అంటూ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పై వస్తోన్న సాంగ్స్ కి టీడీపీ కార్యకర్తలు పూనకాలతో డాన్స్ స్టెప్స్ వేశారు. 

టీడీపీ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ఊగిపోతున్నారు. చంద్రబాబు ఇస్తోన్న ఎనర్జిటిక్ స్పీచ్, యువ నాయకుడు లోకేష్ హడావిడి అన్ని టీడీపీ మహానాడు లో హైలెట్ అవుతున్నాయి. ఈరోజు మే 29 తో మహానాడు కార్యక్రమం ముగియబోతుంది, ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ఏం చెబుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 

TDP Activists Super Steps For Mahanadu Song:

Mahanadu - TDP Activists Super Steps For Mahanadu Song

Tags:   MAHANADU
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ