ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hrithik Roshan teaming with Blockbuster Banne

హృతిక్‌తో హోంబ‌లే బిగ్ డీల్

Hrithik Roshan teaming with Blockbuster BanneHrithik Roshan teaming with Blockbuster Banne

వ‌రుస‌గా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటున్న హోంబ‌లే ఫిలింస్ సంస్థ త‌దుపరి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ తో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తోంది. ఈ విష‌యాన్ని హోంబ‌లే అధికారికంగా ఎక్స్ ఖాతాలో ప్ర‌క‌టించ‌గా, దీనిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌భాస్, య‌ష్ లాంటి పాన్ ఇండియ‌న్ స్టార్ల‌తో ప‌ని చేస్తున్న హోంబ‌లే సంస్థ హృతిక్ తో సినిమా చేయాల‌నుకోవ‌డం వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌.

ఇటీవ‌ల ఉత్త‌రాది ద‌క్షిణాది స్టార్ల క‌ల‌యిక‌లో భారీ పాన్ ఇండియ‌న్ చిత్రాల‌ను నిర్మించేందుకు అగ్ర నిర్మాణ సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో హృతిక్ లాంటి పెద్ద స్టార్ తో ఇత‌ర ద‌క్షిణాది హీరోల‌ను క‌లిపి సినిమాలు తీస్తే, పాన్ ఇండియా మార్కెట్‌కి ఢోఖా ఉండ‌ద‌ని హోంబ‌లే ఆలోచిస్తోంది.

హోంబలే ఫిల్మ్స్ కోసం స‌లార్ స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ స్టార్ య‌ష్, కాంతార స్టార్ రిష‌బ్ శెట్టి ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఉత్త‌రాది నుంచి హృతిక్ కూడా యాడైతే ఇక ర‌చ్చ ర‌చ్చే. పాన్ ఇండియాలో ఎదురే లేని భారీ మ‌ల్టీస్టారర్ల‌ను తెర‌కెక్కించేందుకు ఛాన్సుంటుంది. ప్ర‌భాస్ తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్న హోంబ‌లే, హృతిక్ తోను అదే త‌ర‌హా డీల్ కుదుర్చుకుందా? అన్న‌ది వేచి చూడాలి.

ప్ర‌భాస్ తో స‌లార్ 2 కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న హోంబ‌లే త‌దుప‌రి హృతిక్ ని కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.  హృతిక్ తో బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంద‌ని హోంబలే ఫిల్మ్స్ X (గతంలో ట్విట్టర్)లో వెల్ల‌డించింది. వార్ 2 తో సౌత్ లోను స‌త్తా చాటాలని హృతిక్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో అత‌డితో డీల్ కుదుర్చుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Hrithik Roshan collaborating with Hombale Banner

hrithik roshan