స్టార్ కిడ్ అందం డ్ర‌గ్ లాంటిది

ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో మ‌తి చెడే అందంతో క‌వ్విస్తోంది న‌ట‌వార‌సురాలు రాషా త‌డానీ. న‌టించిన మొద‌టి సినిమాతోనే త‌న‌లో ప్ర‌తిభ‌కు కొద‌వేమీ లేద‌ని నిరూపించింది. ముఖ్యంగా త‌నదైన అందం, ఛాతుర్యంతో ప‌రిశ్ర‌మలో దృష్టిని ఆక‌ర్షించింది. ఈ డెబ్యూ బ్యూటీ .. వెట‌ర‌న్ న‌టి ర‌వీనా టాండ‌న్ కుమార్తె కావ‌డంతో క్రేజ్ మామూలుగా లేదు. ర‌వీనా ఇప్ప‌టికీ న‌టిగా రాణిస్తోంది. ఈ సీనియ‌ర్ న‌టి 90ల‌లో బాల‌కృష్ణ స‌ర‌స‌న బంగారు బుల్లోడులో నటించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ర‌వీనా కుమార్తె రాషా త‌డానీ టైమ్ వ‌చ్చింది.

రాషా ఇటీవ‌లే బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ మేన‌ల్లుడు అమ‌న్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. ఆజాద్ అనేది ఈ సినిమా టైటిల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని అందుకోక‌పోయినా, అంద‌రినీ ఆక‌ర్షించ‌డంలో రాషా త‌డానీ ఫ్యాక్ట‌ర్ ప‌ని చేసింది. త‌దుప‌రి ఈ బ్యూటీ చ‌క‌చ‌కా త‌న ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తోంది. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు రాషా త‌డానీ తొంద‌ర్లోనే టాలీవుడ్ లో డెబ్యూ ఇవ్వ‌నుంది.

ఇక రాషా అంద‌చందాల‌కు త‌గ్గ‌ట్టే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజులో ఉంది. ఈ 18ఏళ్ల అమ్మాయి సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌కు భారీ ఫాలోయింగ్ ఉంది.  రాషా తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. రాషా చిట్టి పొట్టి డెనిమ్ జీన్స్ ధ‌రించి కాంబినేష‌న్ టైట్ టాప్ తో ఆక‌ర్షించింది. త‌డానీ గాళ్ పొట్టి డెనిమ్స్ పై లాంగ్ కోట్ ధ‌రించి కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి.

Rasha Thadani glamour look goes viral

Star kid is insanely beautiful
rasha thadani