Advertisementt

సందీప్ విషయంలో దీపిక కూడా తగ్గట్లేదు

Wed 28th May 2025 04:07 PM
deepika  సందీప్ విషయంలో దీపిక కూడా తగ్గట్లేదు
Deepika indirect reply on Spirit director Sandeep Reddy Vanga సందీప్ విషయంలో దీపిక కూడా తగ్గట్లేదు
Advertisement
Ads by CJ

దీపిక ను స్పిరిట్ చిత్రం లోకి హీరోయిన్ గా తీసుకున్న తర్వాత ఆమె కండిషన్స్, ఆమె వర్కింగ్ స్టయిల్ నచ్చక వెంటనే స్పిరిట్ నుంచి దీపిక పదుకోన్ ని తప్పించడంపై ఆమె పిఆర్ టీమ్ పగబట్టి పనిగట్టుకుని సందీప్ వంగ ఎంతో కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్ట్ ని, స్పిరిట్ కథను చాలా వరకు లీక్ చేసారు అని, అది డర్టీ పిఆర్ గేమ్ అంటూ స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగ దీపిక పీఆర్ టీం పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం చూసాం. 

ఓ నటి ని 100 పెర్సెంట్ నమ్మి క‌థ‌ చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం.. ఇదేనా మీ ఫెమినిజం.. అంటూ సందీప్ వంగ దీపిక పై ఇండైరెక్ట్ గా ఫైర్ అవడం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

అయితే దీపికా పదుకోన్ అలా చేసిందో లేదో సెకండరీ, కానీ ఇక్కడ సందీప్ వంగ ఆరోపణలన్నీ దీపిక వైపే వేలెత్తి చెప్పేవిలా ఉండడంతో ఆమె అభిమానులు ఇది దీపిక పదుకోన్ కి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని కంగారు పడుతున్న సమయంలో దీపిక కూడా ఇండైరెక్టర్ గా సందీప్ వంగాకు ఆన్సర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

నిజాయితీగా, ఖచ్చితంగా ఉండడం నాకిష్టం, మరీ ముఖ్యంగా కష్టమైన సమయంలో నేను నా మనసు చెప్పిందే వింటాను, నా అంతరాత్మ చెప్పినదానికే కట్టుబడి, నాకు ప్రశాంతతనిచ్చే నిర్ణయాలు తీసుకుంటాను అంటూ చేసిన ట్వీట్ సందీప్ వంగాను ఉద్దేశించినది అని అందరూ భావిస్తున్నారు. 

Deepika indirect reply on Spirit director Sandeep Reddy Vanga:

Deepika Revenge Colour Is Bold Red, Takes An Indirect Dig At Sandeep Reddy Vanga

Tags:   DEEPIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ