Advertisementt

టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ డేట్ వచ్చేసింది

Wed 28th May 2025 08:23 AM
tourist family  టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ డేట్ వచ్చేసింది
Much Talked About Film Locks OTT Release Date టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

సెలబ్రిటీస్ మెచ్చిన ఫ్యామిలీ.. టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేస్తుందోహో.. కొద్దిరోజుల క్రితం తమిళనాట విడుదలై పెద్ద చిత్రాలనే వెనక్కి నెట్టిన చిన్న చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ పై సెలబ్రిటీస్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ కి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూడని రోజు లేదు. 

మే 1 న హీరో నాని హిట్ 3, సూర్య రెట్రో చిత్రాలతో పాటుగా థియేటర్స్ లో విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ భారీ కలెక్షన్స్ సాధించడమే కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్, హీరో ధనుష్, దర్శకధీరుడు రాజమౌళి, హీరో నాని లాంటి వాళ్ళు ఈ చిత్రం చూసి టూరిస్ట్ ఫ్యామిలీ చిత్ర బృందాన్ని అభినందించడం, సోషల్ మీడియాలో టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూస్, అలాగే మౌత్ టాక్ చూసి అందరి చూపు ఈ చిత్రం పై పడింది. 

ఫైనల్ గా అందరి ఎదురు చూపులకు తెర పడింది.. టూరిస్ట్ ఫ్యామిలి ఓటీటీ డేట్ లాకైంది. టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా జియో హాట్ స్టార్ ప్రకటించింది. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓటీటీ ఆడియన్స్ జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో టూరిస్ట్ ఫ్యామిలీని వీక్షించేయ్యండి..  

Much Talked About Film Locks OTT Release Date:

Tourist Family To Stream On Jio Hotstar 

Tags:   TOURIST FAMILY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ