అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2 చిత్రాలు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ చిత్రాల్లో నటించిన ప్రతి ఒక్క నటుడికి సుకుమార్ ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంత క్రెడిట్ ఇచ్చారు, వారికీ అంతే పేరొచ్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ ని టాలీవుడ్ హీరో నారా రోహిత్ మిస్ చేసుకోవడం ఆయన అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసింది.
పుష్ప చిత్రంలో నేను నటించాల్సింది, కానీ మిస్సయ్యింది అంటూ నారా రోహిత్ తను నటించిన భైరవం ప్రమోషన్స్ లో బయట పెట్టడం ఆయన అభిమానులకు షాకిచ్చింది. పుష్ప చిత్రం అపుడు కోవిడ్ సమయంలో తనని సంప్రదించాని, మీసాలు ఉన్న ఫోటో పంపి నిర్మాత ఆతర్వాత సుకుమార్ ఆ రోల్ పై తనతో చర్చించారని..
అయితే ఇది పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ స్థానంలోకి మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ని తీసుకుంటున్నట్టుగా చెప్పారట. అలా పుష్ప లో నటించే ఛాన్స్ నారా రోహిత్ చేజారినట్లుగా చెప్పాడు. మరి ఫహద్ ఫాసిల్ ప్లేస్ లో అంటే నారా రోహిత్ అల్లు అర్జున్ తో తలపడే విలన్ గా కనిపించేవాడు, జస్ట్ అది మిస్సయ్యింది.