ఓవర్ నైట్ లో ఈ హిందీ నటి కథనే మార్చేశాడు ప్రముఖ తెలుగు దర్శకుడు. అతడు పెట్టిన భిక్ష ఈరోజు తన స్టార్ డమ్ ని అంతకంతకు పెంచుతూ స్కైని టచ్ చేసేవరకూ వెళుతోంది. ఇప్పుడు ఏకంగా భారీ పాన్ ఇండియన్ సినిమాలో సదరు నటికి అవకాశం కల్పించి ఉలిక్కిపాటుకు గురి చేసాడు.
ఈ ఎపిసోడ్ లో నటి ఎవరో కాదు.. ట్రిప్తి దిమ్రీ. తనకు అవకాశం కల్పించిన తెలుగు దర్శకుడు మరెవరో కాదు.. సందీప్ వంగా.. అతడు ఆరోజు ఊహించి ఉండడు. యానిమల్ ఛాన్స్ ట్రిప్తీ రేంజునే మార్చేస్తుందని! ఈరోజు ట్రిప్తి దిమ్రీ 14 కోట్ల విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకోవడమే గాక, ముంబై బాంద్రాలో షారూఖ్, రణబీర్ లాంటి రిచెస్ట్ సెలబ్రిటీలకు పొరుగు ఇంట్లో నివశించగలగుతోంది.
ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం నుంచి, ఉత్తరాఖండ్ లోని టూటైర్ సిటీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఈ రోజు కోటీశ్వరురాలు. ఓవర్ నైట్ లో యానిమల్ చిత్రం జాతకాన్ని మార్చేసింది. ఇప్పుడు ఒక్కో సినిమాకి 2కోట్లు పైగా డిమాండ్ చేసే రేంజుకు ఎదిగింది. గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక్కడ బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతుంటాయి. కానీ ట్రిప్తీ లాంటి లక్కీ గాళ్స్ అరుదుగా మాత్రమే కనిపిస్తారు.
ముంబైలోని రియల్ ఎస్టేట్ గెలాక్సీలో, బాంద్రా వెస్ట్ సెలబ్రేట్లతో నిండిన కార్టర్ రోడ్ నుండి కొంచెం దూరంలో ట్రిప్టీ ఇల్లు టాప్ స్టార్లు నివశించే చోట కనిపిస్తుంది - షారుఖ్ ఖాన్ మన్నత్ కి, రణబీర్ కపూర్ - అలియా భట్ టెర్రస్ ఇంటి నుంచి సిగ్నల్స్ ఇచ్చేంత దగ్గరగా ట్రిప్తి లాంటి ఒక సాధారణ అమ్మాయి ఇల్లు సొంతం చేసుకోవడం అంటే మాటలా? ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన సందీప్ వంగా స్పిరిట్ లో అవకాశం అందుకుంది. ఈ ఛాన్స్ తో దుబాయ్ ఎమిరేట్స్ లో విలాసాల విల్లాను సొంతం చేసుకుంటుందేమో!