ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించిన మేటి కథానాయిక, తన కెరీర్ లో 70 పైగా చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే, అనూహ్యంగా అమెరికాకు చెందిన డాక్టర్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. కానీ తన వృత్తి , ప్రవృత్తి సినిమా రంగంతో ముడిపడి ఉంది. అందుకే తన భర్తను ఒప్పించి తిరిగి భారతదేశానికి వచ్చి సెటిలైంది. ఇటీవల హిందీ చిత్రసీమలో వరుస చిత్రాల్లో సహాయక పాత్రలు చేస్తోంది. ఈ నటి మరెవరో కాదు వెటరన్ నటి మాధురి ధీక్షిత్. తనదైన అందం, అద్బుత నర్తన, నట ప్రతిభతో దశాబ్ధాల పాటు అగ్ర నాయికగా ఓ వెలుగు వెలిగిన మాధురి ధీక్షిత్ తన కెరీర్ లో ఆర్జించిన సంపదల విలువ ఎంత? అంటే.. దానికి సమాధానం ఇది.
మాధురి ధీక్షిత్ ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. బ్రాండ్స్ ప్రచారం కోసం లక్షల్లో అందుకుంటున్నారు. ఇటీవల రీఎంట్రీలోను భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. కథానాయికగా జోష్ లో ఉన్నప్పుడు కూడా అత్యంత భారీ పారితోషికం అందుకున్న నటీమణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సంపాదనను తెలివైన పెట్టుబడులుతో మాధురి రెట్టింపు చేసారు. భర్తతో కలిసి సొంతంగా సినీనిర్మాణ సంస్థను కూడా మాధురి రన్ చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం మాధురి నికర ఆస్తుల విలువ 250కోట్లు. ఆమె భర్త డా.శ్రీరామ్ నీనే ఆస్తుల విలువ 100 నుంచి 150 కోట్లు. ఆ ఇద్దరి ఆస్తులు కలుపుకుంటే విలువ సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇంత పెద్ద నికర విలువతో ఈ జంట తమ విలాసవంతమైన జీవితాన్ని నచ్చినట్టు ఆస్వాధిస్తోంది. మాధురి ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ `భూల్ భులయా 3`లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పలు క్రేజీ చిత్రాల్లోను మాధురి నటిస్తున్నారు.