కల్వకుంట కవిత తండ్రి కేసీఆర్ కి తలనొప్పిగా తయారైంది, ఆమె తండ్రి కేసీఆర్ కి రాసిన లెటర్ బీఆర్ఎస్ లో అల్లకల్లోలం సృష్టించింది తన తండ్రి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి అంటూ కవిత ఘాటైన వ్యాఖ్యలను ఆ లెటర్ లో సంధించింది. తనకేమైనా ఉంటే తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లి అంతర్గతంగా చర్చించాలి, తనకు తోచిన సలహాలు తండ్రికి ఇవ్వాల్సిన కవిత అలా లేఖ రాయడం, అది లీకవడం ఇప్పుడు అంతా గందరగోళంగా తయారైంది,
ఆమె జైలుకెళ్లొచ్చాక బీఆర్ఎస్ లో సముచిత స్తానం కోసం కవిత పోరాడుతుంది, అన్న కేటీఆర్, హరీష్ రావు లు తనని పక్కకు తప్పించే కుట్ర చేస్తున్నారు, అటు తండ్రి కేసీఆర్ కూడా తనని ఇబ్బందులు పాలు చేసిన బీజేపీ విషయంలో సానుకూంగా ఉంటున్నారనే భావన కవితలో ఎక్కువవడంతోనే ఆమె తండ్రితో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను ఇలా లేఖలో బయటపెట్టింది అంటున్నారు కొందరు.
ఇదే సమయంలో కేటీఆర్ కవిత తండ్రికి రాసిన లేఖ విషయంలో స్పందిస్తూ తన చెల్లి కవిత తప్పు చేసింది అంటూ కామెంట్ చేసారు, పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఏం మాట్లాడినా అది అంతర్గతంగానే మాట్లాడాలి, అది ఎవ్వరికైనా వర్తిస్తుంది, కానీ ఇలాంటి లేఖ రాయడం తప్పన్న కేటీఆర్ ఆ లేఖలోని విషయాలను ప్రస్తావించకపోవడం గమనార్హం.