అవును.. భగభగ మండుతూ పొగలు కక్కుతున్న ఓ అగ్నిపర్వతంలో చిక్కుకుంది ఈ నటి. ఏమో..ఏం జరుగుతుందో అక్కడ. లోన దాగి ఉన్న భడభాగ్నిని భళ్లున కక్కేందుకు సిద్ధంగా ఉన్న ఈ అగ్నిపర్వతానికి దగ్గరగా ఉన్న హోటల్లో స్టే చేసిన నటి ప్రియాంక చోప్రా(పీసీ), ఆ దృశ్యాన్ని షేర్ చేసి ఆశ్చర్యపరిచింది.
పీసీకి ఎంత ధైర్యం? ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రమాదం ఉన్నా దానిని ఎదుర్కొనేందుకు సాహసాలు చేసే అంతర్జాతీయ స్పై ఏజెంట్‌గా నటించింది సిటాడెల్ సిరీస్ లో. రియల్ ఏజెంట్ గా స్పై అవతార్ లో కనిపించింది. కానీ ఇప్పుడు నేరుగా నిజ జీవితంలోనే ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సన్నివేశంలో ఉంది. అయితే అగ్నిపర్వతాలు పేలడం సిసిలీ(ఇటలీ)కి కొత్తేమీ కాదు.
ప్రస్తుతం ఇటలీలోని ఓ బీచ్ లో సేద దీరుతూ బికినీ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా ప్రియాంక చోప్రా షేర్ చేయగా అవన్నీ యూత్ గుండెల్లో జిలెటిన్ స్టిక్స్ లా బ్లాస్ట్ అవుతున్నాయి. పేలడానికి సిద్ధంగా ఉన్న టోర్మినా ఇది అంటూ ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. దూరంగా కొండల్లోంచి పొగలు కక్కుతున్న అగ్నిపర్వతసానువులు దీనిలో హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఇటలీ ట్రిప్ ముగించుకుని పీసీ తొందర్లోనే రాజమౌళి- మహేష్‌లతో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి 29 చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే జాన్ సెనాతోను హాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది.