బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ తో చేసిన క్రేజీ చిత్రం సికందర్. ఈ ఏడాది రంజాన్ స్పెషల్ గా విడుదలైన సికందర్ చిత్రం ఆడియన్స్ ని పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. సల్మాన్ ఖాన్-రష్మిక మందన్న జంటగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ ఏకోశానా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేపోయింది.
థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సికందర్ చిత్రం ఓటీటీలోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమవుతూ వచ్చింది. సికందర్ ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నెట్ ఫ్లిక్స్ డిలే చేస్తూ వచ్చింది.
ఇప్పుడు ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి డేట్ ని అయ్యితే ఇపుడు ఫిక్స్ చేసుకుంది. మే 25 ఆదివారం నుంచి అంటే రేపే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించి షాకిచ్చింది. స్ట్రీమింగ్ కి ఒక్కరోజు ముందు సికందర్ ఓటీటీ డేట్ ని లాక్ చేసి నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించడం సల్మాన్ అభిమానులను షాకయ్యేలా చేసింది.