Advertisementt

కన్నప్ప టీమ్ కి మంచు మనోజ్ క్షమాపణ

Sat 24th May 2025 01:24 PM
manchu manoj  కన్నప్ప టీమ్ కి మంచు మనోజ్ క్షమాపణ
Manchu Manoj apology to Kannappa team కన్నప్ప టీమ్ కి మంచు మనోజ్ క్షమాపణ
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ వ్యక్తిగత వైరాన్ని సినిమాల విషయంలో చూపించడం అభిమానులకు ఎలా ఉన్నా.. కామన్ ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే మంచు మనోజ్ వ్యక్తి గత వైరాన్ని పక్కనపెట్టి తను కన్నప్ప చిత్రం పై చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

అన్న మంచు విష్ణు తో ఆస్తి తగాదాలతో హైలెట్ అవుతున్న మంచు మనోజ్ కొన్నాళ్లుగా తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తో ఓ చిన్నపాటి యుద్ధం చేస్తూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఆ పర్సనల్ వ్యవహారం కాస్తా.. ప్రొఫెషనల్ గా అన్న మంచు విష్ణు కన్నప్ప పైకి మళ్లింది. కన్నప్ప పైకి తాను నటించిన భైరవం చిత్రం విడుదల చేస్తాను అంటూ.. కన్నప్ప-దొంగప్పా అంటూ వెటకారంగా ట్వీట్లు వెయ్యడమే కాదు.. 

భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శివయ్య అంటే శివుడు రాడు, మనసులో తల్చుకుంటే శివయ్య వస్తాడు అంటూ మరోసారి మంచు మనోజ్ కన్నప్ప ను టార్గెట్ చేసాడు. అయితే ఈ వ్యాక్యలు భైరవం చిత్రానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయని భావించాడో ఏమో మంచు మనోజ్ భైరవం ఇంటర్వ్యూలో కన్నప్ప టీం కి క్షమాపణ చెప్పడం మాత్రం అందరిని ఆకర్షించింది. 

సినిమా అంటే అందరి సమిష్టి కృషి అని, ఒక్కరి కోసం సినిమా మీద విమర్శలు చేయడం సరి కాదని, అలా శివయ్యా అని అనడం తప్పు.. కన్నప్ప టీంకు సారీ అని మనోజ్ చెప్పుకొచ్చాడు. 

Manchu Manoj apology to Kannappa team:

Manchu Manoj Apologizes to Kannappa Team

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ