హీరో నాని లేటెస్ట్ చిత్రం హిట్ 3.. శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హిట్ ఫ్రాంచైజీగా తెరకెక్కిన హిట్ 3 కూడా హిట్ అవడంతో నాని కి హీరో గాను, నిర్మాతగానూ లాభపడ్డాడు. హిట్, హిట్ 2, ఇప్పుడు హిట్ 3 తో నాని నిర్మాతగా సక్సెస్ చవిచూశాడు. హిట్ 3 తో 100కోట్ల క్లబ్బులో హీరోగా, నిర్మాతగా నాని సక్సెస్ కొట్టి చూపించాడు.
థియేటర్స్ లో మే 1న విడుదలై హిట్ అయిన హిట్ 3 ఓటీటీ డేట్ పై రోజుకో న్యూస్ వైరల్ అవుతూ ఉంది. జూన్ 5 నుంచి హిట్ 3స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది అన్నారు. హిట్ 3 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి మే 29 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో ఐదు రోజుల్లో హిట్ 3 నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది, థియేటర్స్ లో మిస్ అయిన వారు హిట్ 3ని ఓటీటీ లో వీక్షించేందుకు రెడీ అవ్వండి మరి.