Advertisementt

న‌టి మెడ‌లో ప్ర‌ధాని మోదీ నెక్లెస్

Wed 21st May 2025 10:20 PM
ruchi gujjar  న‌టి మెడ‌లో ప్ర‌ధాని మోదీ నెక్లెస్
Ruchi Gujjar Necklace Turns Heads On Cannes Red Carpet న‌టి మెడ‌లో ప్ర‌ధాని మోదీ నెక్లెస్
Advertisement
Ads by CJ

కేన్స్2025 ఫిలింఫెస్టివ‌ల్ చాలా వింత‌లు, వినోదాల‌కు వేదిక‌గా మారింది. ఈసారి ఫెస్టివల్‌లో నటి రుచి గుజ్జర్ ప్ర‌యోగాత్మ‌క వేష‌ధార‌ణ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని రెడ్ కార్పెట్‌పై చూపించే కస్టమ్-మేడ్ నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. రూప శర్మ రూపొందించిన విలాసవంతమైన భారీ డిజైన‌ర్ గోల్డెన్ లెహంగాలో తన సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్క‌రించ‌డం ఆస‌క్తిక‌రం. జరిబారికి చెందిన రామ్ అనే ప్ర‌తిభావంతుడు చేతితో తయారు చేసిన బంధాని దుప్పట్టను ఈ న‌టి తలపై ధరించింది. జర్డోజీ - గోటా పట్టి తో రూపొందించిన‌ ఈ దుప్పట్టా రాజస్థాన్ వస్త్ర వారసత్వానికి ఆత్మీయ నివాళి.

నెక్లెస్ గురించి న‌టి రుచి కొన్ని వివ‌రాల‌ను చెప్పారు. ఈ నెక్లెస్ ఆభరణాలను మించిన‌ది.. ప్ర‌పంచ వేదికపై భారతదేశం పెరుగుదలకు చిహ్నం. దీనిని కేన్స్‌లో ధరించడానికి కార‌ణం.. భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన మన ప్రధానమంత్రిని నేను గౌరవించాలనుకున్నాను`` అని తెలిపింది. రుచి గ‌జ్జ‌గ‌ర్ సైనిక కుటుంబానికి చెందిన యువ‌తి. 

న‌ట‌న‌లో కొన‌సాగేందుకు ముంబైకి వ‌చ్చింది. ఈ బ్యూటీ జబ్ తు మేరీ నా రహి, హెలి మే చోర్ మరియు అమన్ వర్మతో కలిసి ఏక్ లడ్కీ వంటి మ్యూజిక్ వీడియోలతో పాపులరైంది. పెద్ద తెర‌పై రాణించాల‌ని పెద్ద క‌ల‌లు కంటున్న న‌టి రుచీ.

Ruchi Gujjar Necklace Turns Heads On Cannes Red Carpet:

Ruchi Gujjar, Indian actress, wears PM Modi necklace at Cannes 2025

Tags:   RUCHI GUJJAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ