Advertisementt

తెలుగు ద‌ర్శ‌కుడు క‌మిట్మెంట్ అడిగాడు

Wed 21st May 2025 08:22 PM
saiyami kher  తెలుగు ద‌ర్శ‌కుడు క‌మిట్మెంట్ అడిగాడు
Telugu director asked for commitment తెలుగు ద‌ర్శ‌కుడు క‌మిట్మెంట్ అడిగాడు
Advertisement
Ads by CJ

టాలీవుడ్, బాలీవుడ్ లో సుప‌రిచితురాలైన న‌టి స‌యామీ ఖేర్ తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. తెలుగు సినిమా ఆడిష‌న్ కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు త‌న‌కు ఎదురైన‌ కాస్టింగ్ కౌచ్ సంఘటనను సయామి ఖేర్ తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ మేర‌కు బాలీవుడ్ బ‌బుల్ త‌న క‌థ‌నంలో దీనిని ప్ర‌చురించింది.

మీకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ ఎదురైందా? అని హోస్ట్ ప్ర‌శ్నించ‌గా, సయామి ఖేర్ మాట్లాడుతూ-``నాకు వచ్చిన అన్ని ఆఫర్ల విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. సినిమా పరిశ్రమలో, నాకు 19 లేదా 20 సంవత్సరాల వయసులో తెలుగు సినిమాలో న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న క్ర‌మంలో, ఒక మ‌హిళా కాస్టింగ్ ఏజెంట్ అవ‌కాశం ఇస్తాన‌ని కాల్ చేసారు. మీకు ఈ విష‌యం తెలుసా.. రాజీ పడవలసి ఉంటుంది! అని చెప్పింది. ఒక మ‌హిళ ఇంకో మ‌హిళ‌తో అలా చెప్ప‌డ‌మా? ఇది చాలా డెప్త్ ఉన్న సంగ‌తి అనిపించింద‌ని స‌యామీ అన్నారు.

స‌యామీ ఖేర్ టాలీవుడ్ లో రేయ్, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాల్లో న‌టించారు. అంత‌కుముందే అవ‌కాశాల కోసం తెలుగు చిత్ర‌సీమ‌లో ప్ర‌య‌త్నించాన‌ని తెలిపారు. అయితే స‌యామీకి కాల్ చేసిన లేడీ కాస్టింగ్ ఏజెంట్ ఎవ‌రు?  క‌మిట్ మెంట్ అడిగిన ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

Telugu director asked for commitment:

Telugu director asked for commitment-Saiyami Kher

Tags:   SAIYAMI KHER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ