Advertisementt

జూన్ 1న థియేటర్స్ బంద్ వాయిదా

Wed 21st May 2025 07:39 PM
theatres  జూన్ 1న థియేటర్స్ బంద్ వాయిదా
Theatre bandh postponed to June 1 జూన్ 1న థియేటర్స్ బంద్ వాయిదా
Advertisement
Ads by CJ

జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా

తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉదయం నుంచి వాడి వేడి చర్చలు

జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై చర్చలు

ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్. హాజరైన 40 మంది డిస్ట్రిబ్యూటర్లు. 

సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్. 

డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం.

గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసివేత, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేత.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపిన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.

ఇప్పటికే పైరసీ, ఐపిఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు తెలిపిన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.

Theatre bandh postponed to June 1:

Theatres strike Called Off for now

Tags:   THEATRES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ