Advertisementt

మంచు మనోజ్ కి సింపతీ వర్కౌట్ అవుతుందా

Mon 19th May 2025 07:46 PM
manchu manoj  మంచు మనోజ్ కి సింపతీ వర్కౌట్ అవుతుందా
Manchu Manoj Emotional Speech మంచు మనోజ్ కి సింపతీ వర్కౌట్ అవుతుందా
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ లతో కలిసి భైరవం చిత్రంతో రాబోతున్నాడు. రీసెంట్ గా ట్రైలర్ విడుదల కాగా సినిమా మొత్తం యాక్షన్ ప్యాక్డ్ మల్టీస్టారర్ గా ఎమోషన్ గా ఉండబోతుంది అనేది అర్ధమవుతుంది, నారా రోహిత్, శ్రీనివాస్, మంచు మనోజ్ ముగ్గురికి సమానమైన స్క్రీన్ స్పేస్ దర్శకుడు విజయ్ కనకమేడల ఇచ్చాడనేది స్పష్టంగా తెలుస్తుంది. 

అయితే మంచు మనోజ్ సినిమాలు పక్కనపెట్టినప్పటికీ గత ఏడాదిన్నరగా నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు, కారణం మంచు ఫ్యామిలిలో రగిలిన ఆస్తి తగాదా చిచ్చు. తండ్రి మోహన్ బాబు తో అన్న విష్ణు తో మనోజ్ ఫైట్ చెయ్యడమే కాదు వాళ్ళు MBU యూనివర్సిటీలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. 

ఇక భైరవం ఈవెంట్ లో తన కార్లు, ఇల్లు అన్ని తీసేసుకుని కట్టుబట్టలతో తనని బయటికి గెంటేశారు, కానీ అభిమానులు నన్ను అక్కున చేర్చుకున్నారు, తోడబుట్టినవాళ్ళే నన్ను తరిమేస్తే మీరు ఆదరించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మనోజ్. అది చూసి మనోజ్ కి ఈ సింపతీ ఏమైనా వర్కౌట్ అవుతుందా, భైరవం కి మంచు మనోజ్ సింపతి కార్డ్ వల్ల టికెట్స్ తెగుతాయా అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్. 

Manchu Manoj Emotional Speech:

Manchu Manoj Emotional Speech

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ