పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG సెట్ లో ఉన్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ ని పవన్ కంప్లీట్ చెయ్యడంతో ఆ సినిమాని జూన్ 12 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG కూడా ఫినిష్ చేస్తున్నారు. సుజిత్ పవన్ కళ్యాణ్ డేట్స్ ని చకచకా వాడేస్తూ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారట. పవన్ కి సంబందించిన రెండు వారాల షూట్ మాత్రమే బాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఆతర్వాత హరీష్ శంకర్ తో మొదలు పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేసేస్తారని తెలుస్తుంది. హరిష్ శంకర్ తో పొలిటికల్ కి అలాగే సనాతన ధర్మానికి సంబందిచిన డైలాగ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసి సినిమాల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ చివరి సినిమా అవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. పవన్ సినిమాలను పక్కనపెట్టి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెడతారని, ప్రజలకు సేవే ముఖ్యమని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి పవన్ ఉస్తాద్ తో సినిమాలు ఆపేస్తే పవన్ ఫ్యాన్స్ ఏమైపోతారో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.