కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలిలో జరిగే రచ్చ అందరికి తెలిసిన విషయమే. ఆస్తివ్యవహారాలు విషయంలో మంచు అన్నదమ్ముల నడుమ కొట్టుకునే వరకు వెళ్ళింది. మధ్యలో మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు పక్షాన నిలిచి మంచు మనోజ్ ని టార్గెట్ చేయడం అన్ని మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ తన అభిమానులను తలచుకుని ఎమోషన్ అయిన వీడియో వైరల్ గా మారింది.
భైరవం ట్రైలర్ లో మనోజ్ పై ఓ ఏవి ప్రదర్శించగా.. అది చూసి మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. సొంతవాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు తనపై ప్రేమ కురిపిస్తున్నారని, ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని మనోజ్ చెప్పుకొచ్చాడు.
మనోజ్ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అహం బ్రహ్మాస్మి, వాట్ ద ఫిష్ మూవీస్ అనౌన్స్ చేసాడు, అవి ఎంతవరకు వచ్చాయో తెలియదు కానీ, ఈలోపు మనోజ్ నారా రోహిత్, బెల్లంకొండ సురేష్ ల కాంబోలో భైరవం అంటూ మల్టీస్టారర్ చేసారు. అలాగే తేజ సజ్జా మిరాయి లో మంచు మనోజ్ నటిస్తున్నాడు.